Rythu Bharosa 2nd Installment : రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా రెండో విడత నిధుల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇవాళ రెండో విడుత నిధులు విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ డబ్బులను విడుదల చేసి… రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు.

ఈ పథకం కింద ప్రభుత్వం రాష్ట్రంలో 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందిస్తోంది. ఎకరానికి రూ. 6 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తుంది. ఇవాళ భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల సమక్షంలో రెండో విడత నిధులు విడుదల చేస్తారు.
తెలంగాణలో మొత్తం 73 లక్షల మంది రైతులున్నారు. వీరందరికీ గత నెల 23వ తేదీన మొదటి విడుత రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం పంపిణీ చేసింది. ప్రతి రైతుకు ఒక ఎకరానికి సరిపడే పెట్టుబడి సాయం ముందుగా విడుదల చేసింది. దాదాపు రూ.3,590 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది.
రెండో విడతలో 45,11,947 మంది రైతులు రైతు భరోసా సాయం అందుకుంటారు. దీంతో రూ.5653 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది. రెండో విడత నిధుల పంపిణీ అనంతరం…. మూడో విడత నిధులను వీలైనంత తొందరగా విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
కాళేశ్వరం పనులు పరిశీలన…
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనతో పాటు, కాలేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నేరుగా మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుంటారు. గతంలో బ్యారేజీ కుంగుబాటుకు గురైన నేపథ్యంలో, ప్రస్తుత పరిస్థితిని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. డ్యామ్ సైట్ను సందర్శించిన తర్వాత, సాగునీటి శాఖ అధికారులతో అక్కడే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ప్రాజెక్టు మరమ్మతులు, ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం మరియు భవిష్యత్తు కార్యాచరణపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయనున్నారు. మేడిగడ్డ వద్దే మీడియాతో మాట్లాడి…. ప్రాజెక్టు స్థితిగతులపై వివరణ ఇచ్చే అవకాశం ఉంది.
{{/usCountry}}ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనతో పాటు, కాలేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నేరుగా మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుంటారు. గతంలో బ్యారేజీ కుంగుబాటుకు గురైన నేపథ్యంలో, ప్రస్తుత పరిస్థితిని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. డ్యామ్ సైట్ను సందర్శించిన తర్వాత, సాగునీటి శాఖ అధికారులతో అక్కడే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ప్రాజెక్టు మరమ్మతులు, ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం మరియు భవిష్యత్తు కార్యాచరణపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయనున్నారు. మేడిగడ్డ వద్దే మీడియాతో మాట్లాడి…. ప్రాజెక్టు స్థితిగతులపై వివరణ ఇచ్చే అవకాశం ఉంది.
{{/usCountry}}కాళేశ్వరం పర్యటన తర్వాత…. కాటారం మండలం నస్తురాపల్లి వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ వేదిక నుంచే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'రైతు భరోసా' పథకం కింద రెండో విడత నిధులను రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేసే ప్రక్రియకు ఇక్కడ శ్రీకారం చుట్టనున్నారు.