తాత్కాలిక, హైపర్‌లోకల్ ప్రకటనలు(అడ్వర్టైజ్‌మెంట్లు), బ్యానర్లు, ఫ్లెక్సీల నియంత్రణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(CURE) పరిధిలో పట్టణ అందాలను దెబ్బతీసేలా, ప్రజా రవాణాకు భంగం కలిగించేలా ఏర్పాటు చేసే ప్రకటనలపై కఠిన నిబంధనలను అమలు చేస్తూ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. నగర సౌందర్యాన్ని కాపాడటం, ట్రాఫిక్ చిక్కులను నివారించడం, పౌరుల భద్రతను నిర్ధారించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
కొత్త మార్గదర్శకాల్లోని ముఖ్యమైన అంశాలు

తాత్కాలిక అవసరాల కోసం ఏర్పాటు చేసే అడ్వర్టైజ్‌మెంట్లకు గరిష్ఠంగా 3 రోజులు మాత్రమే అనుమతి లభిస్తుంది.
స్థానిక ప్రాముఖ్యత కలిగిన లేదా చిన్న తరహా వ్యాపార ప్రకటనలు(హైపర్‌లోకల్) ఏర్పాటు చేసుకోవడానికి గరిష్ఠంగా 7 రోజుల పరిమితిని విధించారు.
ప్రకటనల తనిఖీ, అనుమతుల పర్యవేక్షణ కోసం ప్రతి వార్డుకూ ఒక 'అడ్వర్టైజ్‌మెంట్ నోడల్ ఆఫీసర్'ను ప్రత్యేకంగా నియమించనున్నారు.
ప్రభుత్వ ఆస్తులు, పబ్లిక్ ప్రాపర్టీ, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, పచ్చని చెట్లపై ఎలాంటి ఫ్లెక్సీలు, పోస్టర్లు లేదా బోర్డులు పెట్టడంపై సంపూర్ణ నిషేధం విధించారు.
ప్రజా రవాణా భద్రత
ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారి వీక్షణలు, పాదచారుల మార్గాలు (ఫుట్‌పాత్‌లు), సీసీటీవీ కెమెరాల పనితీరుకు ఆటంకం కలిగించేలా ఎలాంటి ప్రకటనల బోర్డులను ఉంచడానికి వీల్లేదు. నూతన నిబంధనల ప్రకారం, సంబంధిత నోడల్ అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా అక్రమంగా ఏర్పాటు చేసే ఫ్లెక్సీలు, కటౌట్లు, యాడ్స్‌ను మున్సిపల్ సిబ్బంది వెంటనే తొలగిస్తారు. అంతేకాకుండా నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తులు, సంస్థలు లేదా ఏజెన్సీలపై భారీగా జరిమానాలు విధిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేసే బాధ్యతలను జీహెచ్‌ఎంసీ, సీఎమ్‌సీ, ఎమ్‌ఎమ్‌సీ కమిషనర్లకు అప్పగించారు. నిబంధనల అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని మున్సిపల్ శాఖ అధికారులను హెచ్చరించింది.
హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాలైన కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ వేగంగా విస్తరిస్తోంది. అయితే పండుగలు, రాజకీయ సభలు, వాణిజ్య ప్రచారాల పేరిట విద్యుత్ స్తంభాలు, పబ్లిక్ ప్రాపర్టీలపై అక్రమంగా వెలుస్తున్న ప్రకటనల వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. సిగ్నల్స్, సీసీటీవీలను కనిపించకుండా ఉండే బోర్డుల వల్ల విజిబిలిటీ తగ్గి ప్రమాదాలు జరిగే అవకాశముంది.
{{/usCountry}}హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాలైన కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ వేగంగా విస్తరిస్తోంది. అయితే పండుగలు, రాజకీయ సభలు, వాణిజ్య ప్రచారాల పేరిట విద్యుత్ స్తంభాలు, పబ్లిక్ ప్రాపర్టీలపై అక్రమంగా వెలుస్తున్న ప్రకటనల వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. సిగ్నల్స్, సీసీటీవీలను కనిపించకుండా ఉండే బోర్డుల వల్ల విజిబిలిటీ తగ్గి ప్రమాదాలు జరిగే అవకాశముంది.
{{/usCountry}}వర్షాకాలంలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లపై కట్టే ఫ్లెక్సీల వల్ల షార్ట్ సర్క్యూట్‌లు జరిగి ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా కట్టే బ్యానర్ల వల్ల నగర రూపురేఖలు దెబ్బతింటున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నూతన సంస్కరణలతో నగరంలో అక్రమ ఫ్లెక్సీ సంస్కృతికి చెక్ పడటంతో పాటు, జవాబుదారీతనం పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.