తల్లిదండ్రులకు అలర్ట్... 'అల్మాంట్–కిడ్' సిరప్‌పై నిషేధం, తెలంగాణ సర్కార్ ఆదేశాలు
పిల్లల కోసం వినియోగించే ఆల్మంట్ కిడ్ సిరప్ వినియోగాన్ని నిలిపివేయాలని తెలంగాణ ఔషధ నియంత్రణ మండలి ( డీసీఏ) ఆదేశించింది. ఈ సిరప్‌లో ఇథలీన్ గ్లైకాల్ ప్రమాదకరంగా ఉన్నట్లుగా గుర్తించిన నేపథ్యంలో ఈ హెచ్చరికలు చేసింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన జారీ అయింది.
పిల్లల్లో అలెర్జీలు, గవత జ్వరం, ఉబ్బసం వంటి వ్యాధుల చికిత్సకు సాధారణంగా సూచించే ఆల్మాంట్-కిడ్ సిరప్ వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

పిల్లల కోసం వినియోగించే అల్మాంట్-కిడ్ (Almont-Kid) సిరప్‌లో మోతాదుకు మించి ప్రమాదకర రసాయనాలు (ఇథిలీన్ గ్లైకాల్) ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ సిరప్‌ను వాడొద్దని తెలంగాణ ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) ప్రజలను హెచ్చరించింది. బిహార్‌కు చెందిన ట్రిడస్ రెమెడీస్ సంస్థ తయారు చేసిన AL-24002 బ్యాచ్ సిరప్‌లలో కల్తీ జరిగినట్లు బెంగాల్‌లో గుర్తించారు. ఈ బ్యాచ్ సిరప్ ఎవరి వద్దనైనా ఉంటే వెంటనే వాడకం ఆపేయాలని…. మార్కెట్‌లో దీని విక్రయాలను నిలిపివేయాలని తెలంగాణ డీసీఏ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసీం వెల్లడించారు.
వాడకూడని సిరప్ వివరాలివే..
మందు పేరు: Almont-Kid Syrup
బ్యాచ్ నం: AL-24002
తయారీ తేదీ: జనవరి -2025
గడువు తేదీ: డిసెంబర్ -2026
దీనిపై సమాచారం లేదా ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబరు 1800-599-6969లో సంప్రదించాలని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి కార్యాలయం నుంచి ప్రకటన జారీ అయింది.
మరోవైపు ఇదే అంశంపై తెలంగాణలో డ్రగ్స్ ఇన్ స్పెక్టర్లను అప్రమత్తం చేస్తూ ప్రభుత్వం నోటీస్ జారీ చేసింది. షాపులు, ఆస్పత్రుల్లో స్టాక్ లేకుండా చూడాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

