...
...
Next Story

ఆ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. 17 శాతానికి పైగా డీఏ.. ఉత్తర్వులు జారీ

తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 70,000 మందికి పైగా 17 శాతం కంటే ఎక్కువ డీఏ లభిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

Updated on: Dec 22, 2025, 18:48:59 IST
Advertisement

విద్యుత్ శాఖ ఉద్యోగులకు 17 శాతానికిపైగా కరువు భత్యం(DA) లభిస్తుందని, దీని వలన 71,000 మందికి పైగా ప్రయోజనం చేకూరుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సీనియర్ అధికారులు తయారుచేసిన ప్రతిపాదనలను ఆధారంగా ఆమోదం తెలిపినట్టుగా భట్టి విక్రమార్క వెల్లడించారు.

విద్యుత్ ఉద్యోగులకు డీఏ
విద్యుత్ ఉద్యోగులకు డీఏ

ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ధరల ప్రభావాన్ని భర్తీ చేయడానికి ప్రభుత్వ రంగ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించే జీవన వ్యయ సర్దుబాటు భత్యమే డీఏ. బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న ధరల సూచి ఆధారంగా చేసుకుని ప్రతి ఏటా జనవరి, జులై నెలలో డియర్ నెస్ అలవెన్స్(డీఏ)/డియర్ నెస్ రిలీఫ్ (డీఆర్)ను సమీక్షిస్తూ విడుదల చేస్తారు.

ఈ ప్రక్రియలో భాగంగా ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లకు డీఏను 17.651 శాతంగా నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది. 1/7/2025 నుంచి అమలయ్యేలా ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లకు డీఏ/డీఆర్‌ను 17.651 శాతంగా నిర్ణయించారు. తాజా ఉత్తర్వులతో విద్యుత్ సంస్థల పరిధిలోనికి 71,387 వేల మంది ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లు లబ్ధి పొందుతారు.

విద్యుత్ సంస్థల పరిధిలోని 71,387 మంది ఈ డీఏ భత్యం ద్వారా ప్రయోజనం పొందనున్నారు. లబ్ధిదారులలో ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TG TRANSCO) 3,036 మంది ఉద్యోగులు, తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGGENCO) 6,913 మంది ఉద్యోగులు, తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) 11,957 మంది ఉద్యోగులు, తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGNPDCL) 9,728 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరితో పాటు కార్మికులు, పెన్షనర్లు కూడా ఉన్నారని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏ అంశం కొలిక్కి రావడంతో విద్యుత్ ఉద్యోగ సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. జూలై 2025 నుంచి వర్తించేలా ఉత్తర్వులు ఇవ్వడంపై భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks