జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ ఉత్తర్వులు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీతో పాటు మల్కాజ్‌గిరి, సైబరాబాద్ లను కార్పొరేషన్లుగా ఏర్పాటయ్యాయి.
కమిషనర్ల నియామకం…

ఉత్తర్వలు జారీ కావటమే కాకుండా ఈ మూడు కార్పొరేషన్లకు ప్రభుత్వం కొత్త కమిషనర్లను కూడా నియమించింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ను యథాతథంగా కొనసాగించింది. సీఎంసీకి(సైబరాబాద్ కార్పొరేషన్) శ్రీజన, ఎంఎంసీకి(మల్కాజ్‌గిరి కార్పొరేషన్) వినయ్ కృష్ణారెడ్డిని కమిషనర్లుగా నియమించారు. ఈ 3 కార్పొరేషన్లకు సంబంధించిన జయశ్ రంజన్ ను ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
1) గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.(GHMC) - ఆర్వీ కర్ణన్, కమిషనర్
2) సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) - శ్రీజన, కమిషనర్
3) మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ ల ఏర్పాటు (MMC) - వినయ్ కృష్ణారెడ్డి, కమిషనర్
ఏ జోన్ ఎక్కడంటే..?
- సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు ఉన్నాయి.
- మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ లో మల్కాజ్ గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్ జోన్లు ఉన్నాయి.
- గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గోల్కోండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లు ఉన్నాయి.
గతంలో 150 డివిజన్లుగా ఉన్న పాత జీహెచ్ఎంసీ పరిధి విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు చేస్తూ వచ్చింది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేయటంతో పాటు ప్రజల నుంచి అభ్యంతరాలను కూడా స్వీకరించింది. ఈ ప్రక్రియంతా కూడా పూర్తి కావటంతో తాజాగా అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా మూడు కార్పొరేషన్ల ద్వారా నగర ప్రజలకు సేవలందనున్నాయి.
పాత జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా 243 డివిజన్లకు పెంచారు. వీటికి అదనంగా విలీన మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధిలో మరో 57 డివిజన్లను ఏర్పాటు చేశారు. మొత్తంగా 300 డివిజన్లతో కూడిన నగర పాలక వ్యవస్థ... ఇప్పుడు మూడు విభాగాలుగా విభజించారు. ఈ కొత్త వ్యవస్థలో 60 సర్కిళ్లు, 12 జోన్లు ఉంటాయి.