Telangana ITI Admissions 2026 : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పారిశ్రామిక శిక్షణ సంస్థలలో (ITIs), అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లలో (ATCs) ఎన్‌సీవీటీ (NCVT)ల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి విడత ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ, వెబ్ ఆప్షన్ల నమోదు గడువును జూలై 10, 2026 వరకు పొడిగించారు. గతంలో నిర్ణయించిన గడువు ముగియడంతో…. దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
- విద్యా అర్హత : 8వ తరగతి లేదా 10వ తరగతి (SSC) ఉత్తీర్ణులైన అభ్యర్థులు సంబంధిత ట్రేడులను బట్టి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- వయస్సు: అభ్యర్థులు 01-08-2026 నాటికి కనీసం 14 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకుని ఉండాలి. అయితే, 'డ్రోన్ టెక్నీషియన్' (Drone Technician) ట్రేడ్ కొరకు కనీసం 16 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
- క్రాఫ్ట్స్‌మెన్ ట్రైనింగ్ స్కీమ్ (CTS) కింద ప్రవేశాలకు గరిష్ట వయోపరిమితి ఏదీ లేదు.
- దరఖాస్తు విధానం మరియు ఎంపిక ప్రక్రియ : ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://iti.telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
- దరఖాస్తు మరియు వెరిఫికేషన్ ఫీజు కింద రూ. 100/- ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా చెల్లించాలి.
- అభ్యర్థులు సింగిల్ అప్లికేషన్ ద్వారానే రాష్ట్రంలోని ఎన్ని ఐటీఐలకైనా, ట్రేడులకైనా తమ ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ భౌతిక (Physical) దరఖాస్తులు స్వీకరించబడవు.
ఎంపిక విధానం….

అభ్యర్థులు అప్‌లోడ్ చేసిన ఒరిజినల్ సర్టిఫికేట్లను ఆన్‌లైన్ ద్వారానే పరిశీలిస్తారు. అభ్యర్థికి పదో తరగతిలో (SSC) వచ్చిన మెరిట్ మార్కులు మరియు ప్రభుత్వ రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుంది. సీటు లభించిన అభ్యర్థులకు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్ఎమ్ఎస్ (SMS) ద్వారా సమాచారం అందుతుంది.
దరఖాస్తుదారులు తమ ఆధార్ కార్డ్‌లో ఉన్న పేరు, పుట్టిన తేదీ వివరాలు పదో తరగతి మెమోలో ఉన్నట్లుగానే సరిచూసుకోవాలి. అలాగే…. దరఖాస్తులో సమర్పించే మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ మరియు ఆధార్ వివరాలు తప్పనిసరి. కోర్సు పూర్తయ్యే వరకు మొబైల్ నంబర్ మార్చకూడదని, నంబర్ మారితే అడ్మిషన్ రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.