ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వ న్యూ ఇయర్ గిఫ్ట్.. రూ.713 కోట్లు విడుదల

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు నూతన సంవత్సర గిఫ్ట్ అందజేసింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను విడుదల చేసింది.

Published on: Dec 31, 2025, 16:12:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల గ్రాట్యుటీ, జీపీఎఫ్ (జనరల్ ప్రావిడెంట్ ఫండ్), సరెండర్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, అడ్వాన్సులతో సహా ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను విడుదల చేసింది. డిసెంబర్ నెలకు సంబంధించి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల కోసం రూ.713 కోట్లను రిలీజ్ చేసింది.

తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన బిల్లులలో ఉద్యోగుల గ్రాట్యుటీ, జీపీఎఫ్ (జనరల్ ప్రావిడెంట్ ఫండ్), సరెండర్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, అడ్వాన్సులకు సంబంధించిన చెల్లింపులు ఉన్నాయి. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు, ఆర్థిక శాఖ అధికారులు డిసెంబర్ 31న ఈ బిల్లులను విడుదల చేశారు.

ప్రభుత్వం గతంలో ఉద్యోగ సంఘాలకు ప్రతి నెలా రూ.700 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. జూన్ నెలాఖరు నాటికి ప్రభుత్వం రూ.183 కోట్లు విడుదల చేసింది. ఆ తర్వాత ఆగస్టు నుండి ప్రతి నెలా కనీసం రూ.700 కోట్లు విడుదల చేస్తూ వస్తోంది.

కొత్త సంవత్సరం సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థికంగా ఊరనిస్తూ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల్లో భాగంగా డిసెంబర్ నెలకు సంబంధించి రూ.713 కోట్లను విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి ఆదేశాల మేరకు.. ఆర్థిక శాఖ అధికారులు వెంటనే నిధులను మంజూరు చేశారు.

తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన రూ.713 కోట్ల నిధుల్లో ఉద్యోగుల గ్రాట్యూటీ, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, సరెండర్ లీవ్స్, వివధ రకాల అడ్వాన్స్‌లకు సంబంధించి.. పెండింగ్ క్లెయిమ్స్ పరిష్కారం అవుతాయి. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, నిధులను విడుదల చేసింది. దీంతో ఉద్యోగులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్టుగా ప్రభుత్వం చెబుతోంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More