...
...
Next Story

పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు..సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ఉపసంహరించుకున్న తెలంగాణ

పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారం పొందేందుకు అనుమతి ఇచ్చింది.

Published on: Jan 12, 2026, 14:26:26 IST
Advertisement

పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేసింది. ఈ సందర్భంగా కీలక తీర్పు వెలువరించింది. తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ అర్హత లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారం పొందేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో తాము పిటిషన్ ఉపసంహరించుకుంటున్నామని తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వెల్లడించారు.

సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టు

రిట్ పిటిషన్ ఉపసంహరించుకున్న తెలంగాణ ప్రభుత్వం.. సివిల్ సూట్ ఫైల్ చేస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది. గోదావరి నది జలాల విషయంలో మహారాష్ట్ర, కర్నాటక వాదనలు కూడా వినాల్సి ఉందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా గుర్తుచేసింది. నీటి కేటాయింపుల ఉల్లంఘనలపై అన్ని రాష్ట్రాల వాదనలు వినేందుకు సివిల్ సూట్ ఫైల్ చేయాలని స్పష్టం చేసింది.

పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్ట్ కోసం సన్నాహక, ప్రాజెక్టు సంబంధిత కార్యకలాపాలను కొనసాగించకుండా ఆంధ్రప్రదేశ్‌ను ఆపాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. దావా వేయడంతో సహా చట్టంలో అందుబాటులో ఉన్న ఇతర తగిన పరిష్కారాలను పొందటానికి, ప్రస్తుత విచారణలో కోరిన అన్ని వాదనలను లేవనెత్తడానికి తెలంగాణకు స్వేచ్ఛను ఇచ్చింది. సివిల్ సూట్ రూపంలో మళ్లీ రావాలని సీజేఐ సూచించారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 అమలును సమర్థించాలని తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టులో వాదనలు వినిపించారు. గోదావరి నదీ జలాల కేటాయింపును నియంత్రించే బైండింగ్ ట్రిబ్యునల్ తీర్పును స్పష్టంగా ఉల్లంఘించిన దృష్ట్యా తెలంగాణ రిట్ పిటిషన్ దాఖలు చేసిందని సింఘ్వీ తెలిపారు.

విచారణ అనంతరం తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆర్టికల్ 131, సివిల్ సూట్ రూపంలో మళ్లీ రావాలని సీజేఐ సూచించారని వెల్లడించారు. దీంతో పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్టుగా చెప్పారు. ఏపీ ప్రభుత్వం అనేకసార్లు ఉల్లంఘనలకు పాల్పడిందని, వాటిని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువచ్చామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. స్టాప్ వర్క్ ఆర్డర్‌ను అమలు చేయడం లేదని తెలిపామన్నారు.

'ఆంధ్రాకు కేటాయించిన 484.5 టీఎంసీలు.. కానీ ఎక్కువగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గోదావరి, కృష్ణా బోర్డులు, అపెక్స్ కౌన్సిల్‌ అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లాం. మెుదట డిజైన్ చేసినదానికంటే.. అదనంగా ఏం చేయడానికి వీల్లేదని వాదించాం.' అని ఉత్తమ్ మాట్లాడారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks