మీలోని క్రియేటివిటీకి పదును పెట్టండి. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక గృహ నిర్మాణ పథకానికి అధికారిక లోగోను అందించే అద్భుతమైన అవకాశం మీకు వచ్చింది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(CURE) పరిధిలో నిర్మించబోయే లక్ష ఎల్‌ఐజీ గృహ నిర్మాణ పథకం కోసం తెలంగాణ హౌసింగ్ బోర్డు ఒక లోగో డిజైన్ పోటీ ప్రకటించింది. ఉత్తమ లోగోను రూపొందించిన విజేతకు అక్షరాలా రూ. 1,00,000 నగదు బహుమతిగా అందించనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి. గౌతమ్ వెల్లడించారు.

ఈ డిజైన్ పోటీలో పాల్గొనడానికి కొన్ని విషయాలు డిజైనర్లు గుర్తుంచుకోవాలి. ముందుగా తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను (https://www.instagram.com/p/Dahnht3zFwE/) ఓపెన్ చేయాలి.
సదరు ఇన్‌స్టాగ్రామ్ బయో (Bio) లో అందుబాటులో ఉన్న గూగుల్ ఫామ్ లింక్‌పై క్లిక్ చేయాలి.
ఫామ్‌లో మీ వ్యక్తిగత వివరాలను పూర్తి చేసి, మీరు తయారు చేసిన లోగో డిజైన్‌ను అక్కడ అప్‌లోడ్ చేయాలంతే. ఆ తర్వాత లోగోలోను పరిశీలించి.. మీ లోగో డిజైన్ నచ్చి.. ఫైనల్ చేస్తే మీరు లక్ష రూపాయలు గెలుచుకోవచ్చు.
మీరు డిజైన్ చేసే లోగో కేవలం ఒక బొమ్మలా కాకుండా.. పేద, దిగువ ఆదాయ వర్గాల ప్రజల సొంతింటి కలలను ప్రతిబింబించేలా ఉంటే మంచిది. ముఖ్యంగా నమ్మకం, ఆశ, పురోగతి, అందరికీ అందుబాటులో ఉండే సరసమైన గృహ నిర్మాణాన్ని సూచించే థీమ్‌తో డిజైన్ చేస్తే బెటర్.
ఈ లోగో డిజైన్ల సమర్పణకు 2026, జూలై 12ను ఆఖరి తేదీగా పెట్టారు. ఆసక్తి ఉన్న క్రియేటర్లు, గ్రాఫిక్ డిజైనర్లు ఈ గడువు లోపు తమ ఎంట్రీలను పంపించాలి.
ఇటీవల ఈ గృహ నిర్మాణ పథకానికి తగిన పేరును సూచించాల్సిందిగా హౌసింగ్ బోర్డు నిర్వహించిన పోటీకి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని వి.పి. గౌతమ్ తెలిపారు. దాదాపు 14 వేల మంది ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని పేర్లను సూచించారు. అతి త్వరలోనే ఈ పథకం అధికారిక పేరును, అలాగే విజేత వివరాలను ప్రకటించనున్నారు. ఈ భారీ గృహ నిర్మాణ పథకం ప్రారంభోత్సవ వేడుకలోనే విజేతలకు బహుమతులను అందజేస్తామని స్పష్టం చేశారు.
{{/usCountry}}ఇటీవల ఈ గృహ నిర్మాణ పథకానికి తగిన పేరును సూచించాల్సిందిగా హౌసింగ్ బోర్డు నిర్వహించిన పోటీకి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని వి.పి. గౌతమ్ తెలిపారు. దాదాపు 14 వేల మంది ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని పేర్లను సూచించారు. అతి త్వరలోనే ఈ పథకం అధికారిక పేరును, అలాగే విజేత వివరాలను ప్రకటించనున్నారు. ఈ భారీ గృహ నిర్మాణ పథకం ప్రారంభోత్సవ వేడుకలోనే విజేతలకు బహుమతులను అందజేస్తామని స్పష్టం చేశారు.
{{/usCountry}}