సూర్యాపేట జిల్లాలో దళిత యువకుడు కర్ల రాజేశ్ కస్టడీ మరణంపై వివరణాత్మక నివేదికను సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. ఈ కేసులో మానవ హక్కుల ఉల్లంఘన ఉందని గుర్తించింది కమిషన్.. అక్రమ నిర్బంధం, కస్టడీలో హింస, యువకుడి కస్టడీ మరణంపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా పరిగణించింది.

మృతుడి తల్లి కర్ల లలిత, మంద కృష్ణ మాదిగతోపాటుగా మరికొందరు సమర్పించిన ఫిర్యాదుల ఆధారంగా కమిషన్ నిర్ణయం తీసుకున్నది. మృతుడిని చిల్కూరు, కోదాడ గ్రామీణ పోలీసులు చట్టవిరుద్ధంగా నిర్బంధించారని, థర్డ్ డిగ్రీ చేశారని, తప్పుడుగా ఇరికించారని, కుటుంబ సభ్యులను కలవడానికి అనుమతి నిరాకరించారని మానవ హక్కుల కమిషన్ గుర్తించినట్టుగా తెలుస్తోంది. తరువాత, ఆ వ్యక్తిని సబ్-జైలు నుండి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తర్వాత నవంబర్ 16న తీవ్ర గాయాలతో మరణించాడని తెలిపింది.
నవంబర్ 4 నుంచి నవంబర్ 9 మధ్య తన కొడుకును చట్టవిరుద్ధంగా పోలీసు కస్టడీలో ఉంచి థర్డ్ డిగ్రీ పద్ధతులను ప్రయోగించి శారీరకంగా హింసించారని యువకుడి తల్లి కర్ల లలిత ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తప్పుడు క్రిమినల్ కేసులో ఇరికించి నవంబర్ 10న జ్యుడీషియల్ కస్టడీకి తరలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
నవంబర్ 10న తన కొడుకు ఆరోగ్యం బాగాలేదని హుజూర్‌నగర్ సబ్-జైలు సిబ్బంది నుండి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, అక్కడికి వెళ్లినప్పుడు తన కొడుకు తీవ్ర అనారోగ్య స్థితిలో ఉన్నాడని లలిత తెలిపారు. నవంబర్ 14న తన కుమారుడి పరిస్థితి విషమంగా ఉండటంతో సూర్యాపేటలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లామని, అక్కడ రాజేశ్ నవంబర్ 16న మరణించాడని మానవ హక్కుల కమిషన్‌కు వివరించారు తల్లి కర్ల లలిత.
వీటన్నింటినీ మానవ హక్కుల కమిషన్ సీరియస్గా తీసుకుంది. ఈ కేసును గతంలో వచ్చిన ఫిర్యాదుతో కలిపి, వివరణాత్మక నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంపై తదుపరి పరిశీలన కోసం జనవరి 12వ తేదీని నిర్ణయించింది.
{{/usCountry}}వీటన్నింటినీ మానవ హక్కుల కమిషన్ సీరియస్గా తీసుకుంది. ఈ కేసును గతంలో వచ్చిన ఫిర్యాదుతో కలిపి, వివరణాత్మక నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంపై తదుపరి పరిశీలన కోసం జనవరి 12వ తేదీని నిర్ణయించింది.
{{/usCountry}}మరోవైపు దళిత యువకుడి కస్టడీ మరణంపై అతని తల్లి దాఖలు చేసిన ఫిర్యాదుపై, తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి విచారణ జరుగుతోందని, చర్యలు తీసుకుంటామని ఇటీవల చెప్పారు.