Telangana Inter Admissions 2026 : ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పొడిగింపు - ఇదే చివరి అవకాశం!

Telangana Inter Admissions 2026 : రాష్ట్రంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల గడువును ఈనెల 7 వరకు పొడిగించారు. అడ్మిషన్లలో ఆధార్, యాంటీ డ్రగ్ డిక్లరేషన్ తప్పనిసరి. ప్రవేశాలకు ఇదే చివరి అవకాశమని అధికారులు స్పష్టం చేశారు.

Published on: Sep 1, 2026, 14:04:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana Inter Admissions 2026 : తెలంగాణలో ఇంటర్ ప్రవేశాల కోసం చూస్తున్న విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు మరో అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలోని అన్ని రకాల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు ఉద్దేశించిన ప్రవేశాల గడువును ఈనెల 7 వరకు పొడిగించింది. అడ్మిషన్ల ప్రక్రియకు ఇదే చివరి అవకాశమని, దీని తర్వాత మరే కారణం చేతనైనా గడువు పొడిగించేది లేదని స్పష్టం చేసింది.

తెలంగాణ ఇంటర్ అడ్మిషన్లు 2026
తెలంగాణ ఇంటర్ అడ్మిషన్లు 2026

ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, ఎయిడెడ్ కళాశాలలతో పాటు సాంఘిక, గిరిజన, మైనారిటీ సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలలు, తెలంగాణ మోడల్ స్కూల్స్, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ) అన్నింటికీ ఈ విస్తరించిన గడువు వర్తిస్తుంది. విద్యార్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా, వీలైనంత త్వరగా తమకు నచ్చిన, అర్హత ఉన్న కళాశాలల్లో సీటును ఖరారు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

అడ్మిషన్ల ప్రక్రియలో కీలక నిబంధనలు

ఇంటర్మీడియట్ ప్రవేశాల నిర్వహణలో కళాశాల యాజమాన్యాలు పక్కాగా పాటించాల్సిన కొన్ని కీలక మార్గదర్శకాలను బోర్డు జారీ చేసింది.

  • ఇంటర్ అడ్మిషన్ల కోసం ఎలాంటి ప్రత్యేక ప్రవేశ పరీక్షలు నిర్వహించకూడదని బోర్డు స్పష్టం చేసింది. పదో తరగతిలో సాధించిన మార్కులు లేదా జీపీఏ మెరిట్ ఆధారంగానే సీట్లు కేటాయించాలి.
  • ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వర్గాల వారీగా రిజర్వేషన్ పద్ధతిని కచ్చితంగా అమలు చేయాలి.
  • అడ్మిషన్ పొందే ప్రతి విద్యార్థి తమ ఆధార్ కార్డును సమర్పించడంతో పాటు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని తెలిపే యాంటీ డ్రగ్ డిక్లరేషన్ పత్రంపై సంతకం చేయడం తప్పనిసరి చేశారు.
  • ప్రైవేట్ కళాశాలల్లో తరగతి గదుల రద్దీని అరికట్టేందుకు ఒక సెక్షన్‌కు గరిష్ఠంగా 88 మంది విద్యార్థులను మాత్రమే చేర్చుకోవడానికి బోర్డు అనుమతించింది.

అడ్మిషన్లు తీసుకునే ముందు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర జాగ్రత్తలు వహించాలని ఇంటర్ బోర్డు సూచించింది. బోర్డు అధికారిక గుర్తింపు పొందిన కళాశాలల జాబితాను ముందుగా పరిశీలించిన తర్వాతే ప్రవేశాలు పొందాలని స్పష్టం చేసింది. అనుమతి లేని కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు చేసే తప్పుడు ప్రచారాలు, ఆకర్షణీయ ప్రకటనలను నమ్మి మోసపోవద్దని హెచ్చరించింది. ఏదైనా సందేహం ఉంటే వెంటనే TGBIE అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More