స్వరాష్ట్రంలో మీడియా తెలంగాణీకరణ చెందాలి : తెలంగాణ జర్నలిస్టుల ఫోరం

తెలంగాణ అస్తిత్వాన్ని పరిరక్షించుకోవాలని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం వ్యాఖ్యానించింది. తెలంగాణ కేంద్రంగా తెలంగాణ ప్రజాప్రయోజనాల కోసమే ఇక్కడి మీడియా పనిచేయాలని డిమాండ్ చేసింది. ఈ దిశగా ప్రభుత్వం, ప్రజలు, మేధావి వర్గాలు కృషి చేయాలని పిలుపునిచ్చింది.

Published on: Jul 21, 2026, 22:37:21 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ జర్నలిస్టుల ఫోరం(టీజేఎఫ్) 25 ఎండ్ల ఆవిర్భావం సందర్భంగా హైదరాబాద్‌లో ఆత్మీయ కలయిక జరిగింది. వ్యవస్థాపకులతో సహా 2001 నుంచి నేటి వరకు టీజేఎఫ్ వేదికగా పనిచేసిన జర్నలిస్టులందరూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులు, వీడియో గ్రాఫర్లు, ఫోటో గ్రాఫర్లు, ఫ్రీలాన్స్ జర్నలిస్టులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా పలు మీడియా ఛానల్స్, పత్రికల్లో పనిచేస్తూనే నాటి ఆంధ్రా యాజమాన్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ కోసం పనిచేసిన తీరు గురించి, వారి అనుభవాలను ఈ సందర్భంగా జర్నలిస్టులు పంచుకున్నారు.

తెలంగాణ జర్నలిస్ట్‌ల ఫోరం సమావేశం
తెలంగాణ జర్నలిస్ట్‌ల ఫోరం సమావేశం

తెలంగాణలోని పత్రికల్లో ఛానెల్‌లలో తెలంగాణ ఎడిటర్లే ఉండాలనీ, తెలంగాణ విడిపోయాక కూడా తెలంగాణ జర్నలిస్ట్ లపట్ల వివక్ష కొనసాగుతుందనీ పలువురు జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల కోసం టీజేఎఫ్ ఎప్పుడూ ప్రశ్నిస్తుందని టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైనా స్వయం పాలన నిలదొక్కుకునేదాకా, పదేండ్లదాకా మద్దతు ప్రకటించాలని నాడు ఎన్నికలముందే టీజేఎఫ్ చేసుకున్న తీర్మానాన్ని ఆయన గుర్తుచేశారు

'ఇకనుంచి ప్రభుత్వాలను ఏమాత్రం మొహమాటం లేకుండా ప్రజాపక్షం వహించి టీజేఎఫ్ ప్రశ్నిస్తుంది. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా నాటి ఉద్యమ స్పూర్తిని కనబరుస్తూ తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ముందుకు సాగుతుంది. నూతనంగా జర్నలిస్టుల వృత్తిలోకి వస్తున్న యువత టీజేఎఫ్‌ను ముందుకు నడిపించాలి.' అని అల్లం నారాయణ అన్నారు.

ఈ సందర్భంగా సీనియర్ సంపాదకులు ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కే.శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ సమాజం అనేక పోరాటాల దశలను దాటుకుంటూ ప్రయాణం సాగించిందని వివరించారు. ప్రతీ ఒక్క ఉద్యమ జర్నలిస్టు వారి వారి అనుభవాలను గ్రంథస్తం చేయాల్సిన అవసరమున్నదన్నారు. తెలంగాణ జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులుగా టీజేఎఫ్ పాత్ర గొప్పదన్నారు. ఎడిటర్‌గా తన అనుభవాలను త్వరలో రికార్డు చేయనున్నట్టు తెలిపారు.

ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు, అంబేద్కర్ ఓపెన్ యూనిర్సిటీ వీసీ గంటా చక్రపాణి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలను కలుపుకొనిపోతూ, మేధావులను సమన్వయం చేసుకుంటూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోశించిన ఘనత తెలంగాణ జర్నలిస్టులదని తెలిపారు.

'తెలంగాణ సాధించుకున్న అనంతర కాలంలో ప్రభుత్వాలను ప్రశ్నించడంలో టీజేఎఫ్ కొంత వెనకపడివున్నది. ఇప్పటికైనా మంచిని మంచి అంటూ చెడును చెడుఅంటూ విమర్శిస్తూ ప్రజాపక్షం వహించాలి.' అని నమస్తే తెలంగాణ మాజీ సంపాదకులు కట్టా శేఖర్ రెడ్డి సూచించారు.

తెలంగాణ మీ అయ్య జాగీరా’ అంటూ రెచ్చిపోతున్నతెలంగాణ వ్యతిరేక శక్తులవల్ల తెలంగాణ అస్తిత్వం మరోమారు ప్రమాదంలో పడిందని టీ న్యూస్ సీఈవో శైలేష్ రెడ్డి తెలిపారు. టీజీఎఫ్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యవస్థాపక సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కూడా మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు రమణ కుమార్, పిట్టల శ్రీశైలం, శశికాంత్, కందుకూరి రమేశ్ బాబు, పీవీ శ్రీనివాస్, రమేశ్ హజారి, దొంతు రమేష్, గుంటిపల్లి వెంకట్, ఆస్కాని మారుతీ సాగర్, ప్రవీణ్ కుమార్ లెంకల, యోగానంద్, శేఖర్, సంపత్, సతీష్, నవీన్ యార, కట్టా కవిత, కరుణ, సుమ బాల, కవిత, సరిత, నర్రా విజయ్, సాధిక్, గుప్తా, రమేశ్ వైట్ల, రమా సరస్వతి, యశోద, సాధిక్, కంబాలపల్లి కృష్ణ, మహేశ్, సూరజ్ భరద్వాజ్, మైక్ టీవీ సతీశ్, చైతన్య, పలువురు సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More