...
...
Next Story

KNRUHS Admissions 2026 : ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల - ఈనెల 5 నుంచి దరఖాస్తులు

TG MBBS BDS Admissions 2026 : తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో 2026-27 విద్యాసంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి KNRUHS నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 5 నుంచి 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Aug 4, 2026, 13:16:59 IST
Advertisement

TG MBBS BDS Admissions 2026 : రాష్ట్రంలోని వైద్య విద్యా కోర్సుల్లో చేరాలనుకుంటున్న విద్యార్థులకు కీలక సమాచారం అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఎంబీబీఎస్ , బీడీఎస్ కోర్సుల ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. కాంపిటెంట్ అథారిటీ కోటా (కన్వీనర్ కోటా) సీట్లలో ప్రవేశాల భర్తీ కోసం వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (KNRUHS) అడ్మిషన్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

నీట్ యూజీ (NEET UG-2026) అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు హెల్త్ యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 5వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 12వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అధికారిక పోర్టల్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

అప్లికేషన్ ప్రాసెస్….

  • అభ్యర్థులు https://tsmedadm.tsche.in వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
  • ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను భర్తీ చేయడంతో పాటు అవసరమైన విద్యార్హత, రిజర్వేషన్, ఇతర ధ్రువపత్రాల స్కాన్ చేసిన ప్రతులను తప్పనిసరిగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • విద్యార్థులు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఒకే ఒక్కసారి మాత్రమే నిర్వహించాలి. తదుపరి కౌన్సెలింగ్ రౌండ్లలో మళ్లీ సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు.

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసిన తర్వాత విశ్వవిద్యాలయ నిపుణుల కమిటీ విద్యార్థులు సమర్పించిన సర్టిఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన వెంటనే అర్హులైన అభ్యర్థులతో తాత్కాలిక మెరిట్ జాబితాను (Provisional Merit List) KNRUHS వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు ప్రాస్పెక్టస్‌ను పూర్తిగా చదివి అవగాహన పెంచుకోవాలి. వయోపరిమితి, స్థానికత, రిజర్వేషన్ నిబంధనలు, అవసరమైన ధ్రువపత్రాల జాబితాను క్షుణ్ణంగా తనిఖీ చేసుకున్న తర్వాతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రారంభించాలి.

కౌన్సెలింగ్, ప్రవేశాలకు సంబంధించిన తాజా అప్‌డేట్‌ల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ http://knruhs.telangana.gov.in ను పరిశీలిస్తూ ఉండాలి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe