తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ పథకానికి సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. పథకంలో పారదర్శకత పెంచడంతో పాటు నకిలీ లబ్ధిదారులను ఏరివేసేందుకు రేషన్ కార్డు, ఆధార్, ఎల్పీజీ (LPG) కనెక్షన్ వివరాల మ్యాపింగ్ ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

ప్రస్తుతం మార్కెట్‌లో గ్యాస్ ధరలు సామాన్యులకు భారంగా మారిన నేపథ్యంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకం పెద్ద ఊరటనిస్తోంది. అయితే ఈ ప్రయోజనం నిరంతరాయంగా కొనసాగాలంటే లబ్ధిదారులు తమ వివరాలను ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.
ఆధార్ కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారుడు తమ గ్యాస్ ఏజెన్సీ లేదా సంబంధిత అధికారుల వద్ద ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఒకవేళ ఆధార్ కార్డు లేని పక్షంలో అర్హులైన వారికి సబ్సిడీ ఆగిపోకుండా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అలాంటి వారు పాన్ కార్డు, ఓటర్ ఐడీ లేదా రేషన్ కార్డు వంటి ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలతో తమ వివరాలను ధ్రువీకరించుకోవచ్చు.
వృద్ధులు లేదా శారీరక శ్రమ చేసే వారికి వేలిముద్రలు పడకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారి కోసం ఐరిస్ స్కానింగ్, ఫేస్ అథెంటికేషన్, మొబైల్ ఓటీపీ లేదా క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా వెరిఫికేషన్ చేసుకునే సదుపాయాన్ని సర్కార్ అందుబాటులోకి తెచ్చింది.
ఈ పథకం అమలులో ఎలాంటి జాప్యం జరగకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెలా ఆయిల్ కంపెనీలకు సబ్సిడీ నిధులను ముందస్తుగానే చెల్లిస్తోంది. లబ్ధిదారులు ముందుగా పూర్తి ధర చెల్లించి సిలిండర్ కొనుగోలు చేసిన తర్వాత రూ.500 పోను మిగిలిన సబ్సిడీ మొత్తాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానం ద్వారా నేరుగా వారి ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది.
ఇప్పటికే రూ.500 గ్యాస్ సిలిండర్ పొందుతున్న వారు సైతం ఈ కొత్త నిబంధనల ప్రకారం తమ ఈ-కేవైసీ, మ్యాపింగ్ స్టేటస్‌ను సరిచూసుకోవాలి. సకాలంలో ఆధార్ వివరాలు సమర్పించకపోయినా, అథెంటికేషన్ పూర్తి చేయకపోయినా వచ్చే నెల నుండి సబ్సిడీ నిలిచిపోయే ప్రమాదం ఉంది. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా, వెంటనే తమ సమీపంలోని గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
{{/usCountry}}ఇప్పటికే రూ.500 గ్యాస్ సిలిండర్ పొందుతున్న వారు సైతం ఈ కొత్త నిబంధనల ప్రకారం తమ ఈ-కేవైసీ, మ్యాపింగ్ స్టేటస్‌ను సరిచూసుకోవాలి. సకాలంలో ఆధార్ వివరాలు సమర్పించకపోయినా, అథెంటికేషన్ పూర్తి చేయకపోయినా వచ్చే నెల నుండి సబ్సిడీ నిలిచిపోయే ప్రమాదం ఉంది. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా, వెంటనే తమ సమీపంలోని గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
{{/usCountry}}ABOUT THE AUTHOR
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.