Telangana Oversees Vidya Nidhi : విదేశీ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని కలలు కంటున్న బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని "మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి" పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. 2026 ఆగస్టు/సెప్టెంబర్ ఫాల్ సెషన్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఈ విడతలో ప్రభుత్వం మొత్తం 350 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఇందులో 250 సీట్లను బీసీ వర్గాలకు, 100 సీట్లను ఈబీసీ విద్యార్థులకు కేటాయించారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా వంటి ప్రముఖ దేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ వంటి కోర్సులు చదవాలనుకునే విద్యార్థులకు ఈ పథకం ద్వారా ప్రభుత్వం భారీగా ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. ఎంపికైన ప్రతి విద్యార్థికి రూ. 20 లక్షల వరకు స్కాలర్‌షిప్‌తో పాటు ఒక వైపు విమాన ఛార్జీలు లభిస్తాయి.
ఎవరు అర్హులు...? ఉండాల్సిన అర్హతలు ఇవే…
- విదేశీ విద్యానిధికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు కొన్ని నిర్దిష్ట ప్రమాణాలను కలిగి ఉండాలని బీసీ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది.
- కుటుంబ వార్షిక ఆదాయం అన్ని వనరుల నుంచి రూ. 5 లక్షలకు మించకూడదు.
- దరఖాస్తు చేసుకునే నాటికి అభ్యర్థి వయస్సు 35 సంవత్సరాల లోపు ఉండాలి.
- డిగ్రీ లేదా గ్రాడ్యుయేషన్ కోర్సులో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.
- అభ్యర్థులు GRE పరీక్షలో కనీసం 260 స్కోర్ లేదా GMAT లో 500 స్కోర్ సాధించి ఉండాలి.
- ఆంగ్ల భాషా నైపుణ్య పరీక్షల్లో TOEFL లో 60 మార్కులు, లేదా IELTS లో 6.0 బ్యాండ్, లేదా PTE లో 50 మార్కుల స్కోర్ తప్పనిసరి.
దరఖాస్తు విధానం ఇలా...
ఈ పథకానికి అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 1, 2026 నుంచి సెప్టెంబర్ 30, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత గడువు దాటిన తర్వాత వచ్చిన దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణించబోమని అధికారులు స్పష్టం చేశారు.
{{/usCountry}}ఈ పథకానికి అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 1, 2026 నుంచి సెప్టెంబర్ 30, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత గడువు దాటిన తర్వాత వచ్చిన దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణించబోమని అధికారులు స్పష్టం చేశారు.
{{/usCountry}}విదేశాల్లో చదువుకోవాలనే ఆకాంక్ష ఉండి… ఆర్థిక స్థోమత లేని పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని తక్షణమే సద్వినియోగం చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ సూచించింది. పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం, మార్గదర్శకాలు, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కోసం తెలంగాణ ఈ-పాస్ అధికారిక వెబ్‌సైట్ telanganaepass.cgg.gov.inను సందర్శించవచ్చు.