యూఏఈలో తెలంగాణ వ్యక్తి మృతి.. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 16 గంటలు మృతదేహం

యూఏఈలో తెలంగాణలోని జగిత్యాల జిల్లాకు చెందిన వ్యక్తి మరణించారు. అయితే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడానికి 16 గంటల సమయం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.

Published on: Feb 23, 2026, 18:29:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో మరణించిన తెలంగాణకు చెందిన వ్యక్తి మృతదేహాన్ని హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న దాదాపు 16 గంటల తర్వాత ఆయన కుటుంబానికి అప్పగించారు. దీని ఫలితంగా ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అంత్యక్రియల ఏర్పాట్లు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రం ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం కొండ్రికర్ల గ్రామానికి చెందిన నరేందర్ నర్సయ్య శ్రీరామ్ ఫిబ్రవరి 16న షార్జాలో గుండెపోటుతో మరణించారు.

ఆదివారం తెల్లవారుజామున 3.20 గంటలకు షార్జా నుండి ఎయిర్ అరేబియా విమానంలో ఆయన మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఆ విమానం శంషాబాద్ విమానాశ్రయంలో దిగింది. రాక గురించి తమకు ముందస్తుగా సమాచారం అందించలేదని, దీనివల్ల గందరగోళం ఏర్పడిందని, కార్గో ఫార్మాలిటీలను పూర్తి చేయడంలో జాప్యం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

మృతుడి బంధువు దామోదర్ మాట్లాడుతూ.. మృతదేహాన్ని తీసుకెళ్లాలని ఎయిర్‌లైన్ కార్గో విభాగం నుండి తనకు ఫోన్ వచ్చిందని చెప్పారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్‌కు వెళ్లి ప్రక్రియలను పూర్తి చేశారు. ఆదివారం రాత్రి మృతదేహాన్ని అప్పగించారు. సుమారు 16 గంటల తర్వాత అప్పగించినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు.

మృతదేహానికి కొన్ని గంటల్లో అంత్యక్రియలు పూర్తి చేసేలా సంప్రదాయం ఉంటుందని కుటుంబ సభ్యులు అన్నారు. నర్సయ్య మృతదేహానికి సంబంధించిన విషయం చెరవేయడంలో జాప్యం జరిగిందంటున్నారు. యజమాని, విమానయాన సిబ్బంది మధ్య సమన్వయ లోపం వల్లే అంత్యక్రియల ఆలస్యమైందన్నారు. మృతదేహాన్ని తీసుకొచ్చిన తర్వాత అంత్యక్రియల ఆచారాలను తిరిగి చేసినట్టుగా చెప్పుకొచ్చారు.

ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీమ్ రెడ్డి జోక్యం చేసుకుని ఎయిర్‌లైన్ అధికారులను సమన్వయం చేసి ప్రక్రియను వేగవంతం చేశారన్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించడానికి అంబులెన్స్‌ను కూడా ఏర్పాటు చేసినట్టుగా వెల్లడించారు. మెుత్తానికి నర్సయ్య అంత్యక్రియలు అనుకున్న సమయంలో జరగలేదు. దీంతో ఆలస్యంగా కార్యక్రమాలు పూర్తి చేశారు కుటుంబ సభ్యులు. అధికారులు సరైన సమయంలో సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేదని అంటున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More