తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచార మైకులు సైలెంట్.. పోలింగ్‌కు పార్టీలు రెడీ!
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మైకులు బంద్ అయిపోయాయి. ఇక అన్ని రాజకీయ పార్టీలు పోలింగ్‌కు రెడీ అయ్యాయి.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ముగిసింది. ప్రచారానికి చివరిరోజైన సోమవారం ఓటర్ల దృష్టిని ఆకర్షించడానికి ప్రధాన పార్టీలు పెద్ద ఎత్తున ర్యాలీలు, ప్రదర్శనలు చేశాయి. ముఖ్యనేతలంతా జనాల్లో ఉన్నారు. సాయంత్రం ప్రచారం ముగియడంతో మైకులు బంద్ అయ్యాయి. ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి 13న ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

మూడు ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు బహిరంగ సభలలో ప్రసంగించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ర్యాలీలలో పాల్గొని బీఆర్ఎస్‌ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
బీజేపీ తరఫున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీలు ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. మరోవైపు జనసేన అభ్యర్థులు ప్రచారం చేశారు. వారి తరఫున కొందరు సినిమా నటులు ప్రచారంలో పాల్గొన్నారు. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం పాల్గొంటారనుకున్నా.. తర్వాత క్యాన్సిల్ అయింది.
ఈ ఎన్నికలు 116 మునిసిపాలిటీలలోని 2,582 వార్డులు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలోని 414 వార్డులలో జరుగుతాయి. మొత్తం 32 జిల్లాల్లోని 2,996 వార్డులలో ఎన్నికలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8,203 పోలింగ్ కేంద్రాలలో వెబ్-కాస్టింగ్ సౌకర్యాలతో సహా స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా విస్తృత ఏర్పాట్లు చేశారు.
మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 26.80 లక్షల మంది మహిళా ఓటర్లు, 25.62 లక్షల మంది పురుష ఓటర్లు, ఇతరులలో 640 మంది ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్ల భాగస్వామ్యం ఎక్కువగా ఉంది.
పోలింగ్, లెక్కింపు సజావుగా నిర్వహించడానికి వీలుగా 16,031 బ్యాలెట్ పెట్టెలు, 137 స్ట్రాంగ్ రూములు, 136 లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. ఫలితాల ప్రకటన తర్వాత పట్టణ స్థానిక సంస్థల ఎన్నికైన వార్డు సభ్యులు ఫిబ్రవరి 16న ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు.
మరోవైపు 25000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1900 సమస్యాత్మక, 1400 అత్యంత సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రాలను గుర్తించి సీసీటీవీ మానిటరింగ్‌తో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మద్యం దుకాణాలను మూసివేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


