కారులో ఒంటరిగా ప్రయాణించే వారిపై జరిమానా విధించేలా కొత్త ట్రాఫిక్ నిబంధనలు తేవాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోందంటూ జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ పోలీసులు స్పందించారు. సోషల్ మీడియాలో, కొన్ని వర్గాల్లో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పారు. ఈ వార్తలను పూర్తిగా అవాస్తవంగా కొట్టిపారేశారు.
సూచన మాత్రమే….

రోడ్లపై వాహనాల రద్దీని నియంత్రించే ఉద్దేశంతోనే ప్రజలకు ఒక విజ్ఞప్తి చేశామని పోలీసులు వివరించారు. ఒక్కొక్కరు ఒక్కో కారులో ఒంటరిగా ప్రయాణించే బదులు, ఇతరులతో కలిసి కార్పూలింగ్ చేయాలని సూచించామన్నారు. వాహనాల సంఖ్య తగ్గితే ట్రాఫిక్ సమస్య కొంతవరకు అదుపులోకి వస్తుందనే ఉద్దేశంతోనే ఉమ్మడి ప్రయాణాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ సూచనకు జరిమానాలు లేదా శిక్షలతో ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు.
కారులో ఒంటరిగా ప్రయాణించే వారికి జరిమానా విధించే ప్రతిపాదన ఏదీ కూడా ప్రభుత్వ పరిశీలనలో లేదని పోలీసులు వెల్లడించారు. అపోహలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.
నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థను ఎక్కువగా వినియోగించుకోవాలని పోలీసులు కోరారు. వీలున్నంత మేర కార్పూలింగ్ వంటి ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాలను ఎంచుకోవాలని హితవు పలికారు. కారులో ఒంటరిగా వెళ్లినందుకు ఎలాంటి జరిమానా లేదా శిక్ష విధించే ప్రణాళిక లేదని మరోసారి స్పష్టం చేశారు.
ABOUT THE AUTHOR
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.