వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేసేందుకు తెలంగాణ రక్షణ సేన సిద్ధమైంది. ఈ మేరకు పోటీ చేసే అభ్యర్థిని ఖరారు చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత ప్రకటన విడుదల చేశారు.
అభ్యర్థిగా శ్రీకాంత్ గౌడ్…

ఉద్యమకారుడు, డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను ఎమ్మెల్సీ బరిలో నిలుపుతున్నట్లు కవిత ప్రకటించారు. విజయదశమి దసరా పండుగ శుభ ముహూర్తాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయాన్ని వెలువరించారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆవిర్భవించిన తర్వాత ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగటం ఇదే తొలిసారి..!
ఈ ఎన్నికల ప్రక్రియను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా సమన్వయం చేసేందుకు తెలంగాణ రక్షణ సేన ముఖ్య నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో పార్టీ ఎన్నికల కో-ఆర్డినేషన్, ప్రచార పర్యవేక్షణ కోసం సీనియర్ నాయకుడు సయ్యద్ ఇస్మాయిల్‌ను 'స్టేట్ పార్టీ అబ్జర్వర్'గా నియామకం చేస్తున్నట్లు కవిత వెల్లడించారు. ఈ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని గ్రాడ్యుయేట్ ఓటర్లను ఏకం చేసేందుకు ఇస్మాయిల్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు పనిచేయనున్నాయి.
అభ్యర్థి నేపథ్యం….
ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌కు విద్యార్థి, ఉద్యమనాయకుడిగా నేపథ్యం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా (ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా) నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ గౌడ్…. కాకతీయ యూనివర్సిటీ నుంచి పిహెచ్‌డి (PhD) పట్టా పొందారు. మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా, తెలంగాణ జాగృతి సంస్థలో ప్రారంభం నుంచి క్రియాశీలక సభ్యుడిగా చురుగ్గా పాల్గొన్నారు. కల్వకుంట్ల కవితతో కలిసి అనేక సామాజిక, సాంస్కృతిక ఉద్యమాల్లో భాగస్వామి అయ్యారు.
గత మూడేళ్లుగా బహుజనులు, సామాజిక వర్గాల గొంతుకగా అనేక ప్రజా ఉద్యమాలకు కల్వకుంట్ల కవిత రూపకల్పన చేశారు. అదే సామాజిక న్యాయ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, మొదటిసారిగా పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఒక బహుజన ఉద్యమకారుడికి అవకాశం కల్పించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. గ్రాడ్యుయేట్లు, విద్యాధికులు, నిరుద్యోగుల సమస్యలపై శాసనమండలిలో పోరాడేందుకు శ్రీకాంత్ గౌడ్ సరైన అభ్యర్థి అని పార్టీ విశ్వాసం వ్యక్తం చేసింది.
{{/usCountry}}గత మూడేళ్లుగా బహుజనులు, సామాజిక వర్గాల గొంతుకగా అనేక ప్రజా ఉద్యమాలకు కల్వకుంట్ల కవిత రూపకల్పన చేశారు. అదే సామాజిక న్యాయ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, మొదటిసారిగా పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఒక బహుజన ఉద్యమకారుడికి అవకాశం కల్పించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. గ్రాడ్యుయేట్లు, విద్యాధికులు, నిరుద్యోగుల సమస్యలపై శాసనమండలిలో పోరాడేందుకు శ్రీకాంత్ గౌడ్ సరైన అభ్యర్థి అని పార్టీ విశ్వాసం వ్యక్తం చేసింది.
{{/usCountry}}