Telangana Ration Card eKYC Status : తెలంగాణలో ఉచిత రేషన్ బియ్యం పొందుతున్న లబ్ధిదారులకు ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియ అత్యంత కీలకంగా మారింది. పారదర్శకతను పెంచేందుకు, అనర్హులను తొలగించేందుకు ప్రభుత్వం రేషన్ కార్డులతో ఆధార్ అనుసంధానాన్ని విధిగా చేపడుతోంది. ఈ నెలాఖరు నాటికి (జూలై 31) ప్రతి లబ్ధిదారుడు ఈ-కేవైసీ ప్రక్రియను ముగించాల్సి ఉంటుంది.

ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఈ-కేవైసీ పూర్తి చేయని సభ్యుల పేర్లను రేషన్ కార్డుల నుంచి అధికారులు తొలగించే అవకాశాలు ఉన్నాయి. దీంతో భవిష్యత్తులో ఉచిత రేషన్ బియ్యం నిలిచిపోవడమే కాకుండా, రేషన్ కార్డు (ఆహార భద్రతా కార్డు) ప్రాతిపదికన ప్రభుత్వం అందించే ఇతర సంక్షేమ పథకాలను కూడా కోల్పోవాల్సి వస్తుంది. అందుకే చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే ప్రక్రియను పూర్తి చేయాలని యంత్రాంగం కోరుతోంది.
మీ రేషన్ కార్డుకు సంబంధించి ఈ-కేవైసీ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందో లేదో తెలుసుకోవడానికి ఇకపై అధికారుల చుట్టూ గానీ, రేషన్ షాపుల చుట్టూ గానీ తిరగాల్సిన అవసరం లేదు. మీ చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్ ద్వారానే అత్యంత సులభంగా రేషన్ కార్డ్ e-KYC స్టేటస్‌ను నిమిషం వ్యవధిలోనే చెక్ చేసుకోవచ్చు.
మొబైల్‌లో e-KYC స్టేటస్ చెక్ చేసుకునే విధానం:
- ముందుగా మీ మొబైల్ బ్రౌజర్లో https://smartpds.telangana.gov.in/ అధికారిక లింక్‌పై క్లిక్ చేయాలి.
- పోర్టల్ హోమ్ పేజీ ఓపెన్ అయిన తర్వాత… అందులో కనిపించే Beneficiary Details పై నొక్కాలి.
- ఇక్కడ ఓపెన్ అయ్యే విండోలో మీ రేషన్ కార్డు నెంబర్ తో పాటు క్యాప్చాను నమోదు చేయాలి.
- ఇక్కడ రేషన్ కార్డులోని సభ్యుల పేర్లతో పాటు ఈకేవైసీ స్టేటస్ వివరాలు కూడా కనిపిస్తాయి.
- స్టేటస్ యాక్టివ్ అని ఉంటే ఈకేవైసీ పూర్తి అయినట్లు భావించాలి.
ఈకేవైసీ ఎక్కడ చేసుకోవాలంటే..?
{{/usCountry}}

{{/usCountry}}లబ్ధిదారులు తమ పరిధిలోని రేషన్ దుకాణానికి వెళ్లాలి. అక్కడ ఉండే ఈ-పోస్ (e-POS) యంత్రంలో వేలిముద్ర (బయోమెట్రిక్) లేదా ఐరిస్ స్కాన్ ద్వారా కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. మీసేవా కేంద్రాల్లో కూడా ఆధార్ ధృువీకరణ ద్వారా ఈ-కేవైసీ చేసుకునే సదుపాయం ఉంది. రేషన్ కార్డుతో పాటు…. అందులో నమోదైన సభ్యులందరి ఒరిజినల్ ఆధార్ కార్డులను వెంట తీసుకెళ్లాలి. ఈ-కేవైసీ నమోదు ప్రక్రియ పూర్తిగా ఉచితం. దీని కోసం రేషన్ డీలర్లకు లేదా ఇతరులకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది.