...
...
Next Story

Ration Rice Distribution : రేషన్ కార్డుదారులకు అప్డేట్ - 3 నెలల కోటా బియ్యం పంపిణీ గడువు పొడిగింపు..!

Telangana Ration Rice Distribution : తెలంగాణలో మూడు నెలల ఉచిత రేషన్ బియ్యం పంపిణీ గడువును ప్రభుత్వం సెప్టెంబర్ 5 వరకు పొడిగించింది. రాఖీ పండుగ, వర్షాల కారణంగా ఇప్పటివరకు బియ్యం తీసుకోలేని వారు… వెంటనే రేషన్ తీసుకోవాలని అధికారులు సూచించారు.

Published on: Sep 3, 2026, 14:26:03 IST
Advertisement

Telangana Ration Rice Distribution : తెలంగాణలోని రేషన్‌ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న మూడు నెలల రేషన్‌ బియ్యం ఉచిత పంపిణీ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

రేషన్ షాపు (ఫైల్ ఫొటో)
రేషన్ షాపు (ఫైల్ ఫొటో)

ఫలితంగా ఇప్పటివరకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన బియ్యం కోటాను తీసుకోలేకపోయిన పేద కుటుంబాలకు పెద్ద ఊరట లభించింది. తాజా ఆదేశాల ప్రకారం…. సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్‌ దుకాణాల్లో ఈ బియ్యం పంపిణీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగనుంది.

గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలు, వర్షాభావ పరిస్థితులు, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని ఆదేశించింది. మొదటగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం…. ఈ బృహత్తర ప్రక్రియ ఆగస్ట్ 1వ తేదీన ప్రారంభమైన ఈ పంపిణీ…. ఆగస్ట్ 31వ తేదీతో గడువు ముగియాల్సి ఉంది.

ఒకేసారి మూడు నెలల బియ్యం ఉచితంగా ఇస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్‌ షాపుల వద్ద లబ్ధిదారుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ప్రతీ షాపు వద్ద రేషన్ కార్డుదారులు గంటల తరబడి వరుసలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటికితోడు ఇటీవల వచ్చిన రాఖీ పౌర్ణమి పండుగ కారణంగా వేలాది మంది ప్రజలు తమ స్వగ్రామాలకు, బంధువుల ఇళ్లకు వెళ్లారు. దీంతో నిర్ణీత సమయంలో చాలామందికి తమకు కేటాయించిన బియ్యాన్ని తీసుకునే వీలు లేకుండా పోయింది. చివరి రోజుల్లో కూడా డీలర్ల వద్ద రద్దీ తీవ్రమవ్వడంతో పంపిణీ ప్రక్రియ పూర్తిస్థాయిలో సాగలేదు.

ఈనెల 5 వరకు గడువు పొడిగింపు…

ఇప్పటివరకు సరుకులు తీసుకోని రేషన్ కార్డుదారులు ఈ అదనపు సమయాన్ని వెంటనే సద్వినియోగం చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు కోరుతున్నారు. సెప్టెంబర్ 5 గడువు ముగిసిన తర్వాత మళ్లీ అదనంగా సమయం ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. కాబట్టి మిగిలిపోయిన కార్డుదారులు ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే తమ సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి ఈ-కేవైసీ/బయోమెట్రిక్ ప్రక్రియ ద్వారా తమ బియ్యాన్ని తెచ్చుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe