తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం.. ఫ్యూచర్ సిటీపై నాగర్జున కామెంట్స్

రెండు రోజులపాటు నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్  ప్రారంభమైంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు సమ్మిట్‌కు వచ్చారు.

Published on: Dec 8, 2025, 15:20:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ రైజింగ్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల్లో ఈ సమావేశం జరుగుతోంది. ప్రారంభోత్సవానికి 44 దేశాల నుండి 154 మంది ప్రతినిధులు హాజరు అయ్యారు.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్

విజన్ 2047 ప్రణాళిక, వ్యాపార అవకాశాలు, పెట్టుబడులకు ప్రభుత్వ మద్దతు, తెలంగాణ పాలన వ్యూహాలు, భారత్ ఫ్యూచర్ సిటీ వంటి కీలక అంశాలను ఈ సమావేశం లక్ష్యంగా పెట్టుకుంది. అనేక మంది జాతీయ ప్రతినిధులు, ప్రముఖులు ఇప్పటికే వచ్చారు. సదస్సు ప్రారంభానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి అక్కడకు చేరుకుని స్టాళ్లను పరిశీలించారు. తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

నిర్ణీత లక్ష్యాలు నిర్దేశించుకొని తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఈ సందర్భంగా అన్నారు. 2047లోగా 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలని లక్ష్యమని గుర్తు చేశారు. మహిళా రైతులను పలు విధాలుగా ప్రోత్సహిస్తున్నట్టుగా చెప్పారు. బస్సుల నిర్వహణ కూడా మహిళా సంఘాలకు ఇచ్చామన్నారు. వికసిత్ భారత్ దిశగా వేగంగా తెలంగాణ అడుగులు వేస్తోందన్నారు.

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కారులో సమ్మిట్ వద్దకు నటుడు నాగర్జున వచ్చారు. అనంతరం ముఖ్యమంత్రితో కలిసి స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా నాగర్జున మాట్లాడారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ గురించి మాట్లాడారు. 50 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నామని, ఇక్కడ బాగుందని చెప్పారు. తెలంగాణలో అన్నపూర్ణ స్టూడియో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు, ఫ్యూచర్ సిటీలో మరో స్టూడియో నిర్మాణానికి బాలీవుడ్ ప్రముఖులు కలిసి ముందుకు రావడం మంచి పరిణామం అని చెప్పారు. అందరూ కలిసి వస్తే ప్రపంచ వ్యాప్త ఫెసిలిటీస్‌తో పెద్ద నిర్మాణం చేయవచ్చన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఫ్యూచర్ సిటీ ఆలోచన బాగుందన్నారు నాగర్జున.

తయారీ, నిర్మాణ వృద్ధిలో తెలంగాణ అనేక రాష్ట్రాలకు రోల్ మోడల్ అని తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఒంటరిగా మనం చాలా తక్కువ చేయగలమని, కలిసి మనం చాలా చేయగలమని చెప్పారు. రాష్ట్ర లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వం, పరిశ్రమ, ప్రతినిధుల మధ్య సహకారాన్ని ఆయన నొక్కి చెప్పారు.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం.. విక్షిత్ భారత్ లక్ష్యం వైపు వేగంగా ముందుకు సాగుతోందన్నారు. ఈ సమావేశాన్ని విజయవంతంగా అభివర్ణించారు. 20 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే వ్యవసాయ రుణ మాఫీల గురించి కూడా మాట్లాడారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More