తెలంగాణ స్కూల్ అకడమిక్ క్యాలెండర్ 2026-27 విడుదల.. ఇదిగో పరీక్షలు, సెలవుల పూర్తి షెడ్యూల్!

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ 2026-27 విద్యాసంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. తరగతుల నిర్వహణ, పరీక్షలు, సెలవుల గురించి ప్రస్తావించారు.

Published on: Jun 7, 2026, 19:28:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన వార్షిక అకడమిక్ క్యాలెండర్‌ను అధికారికంగా విడుదల చేసింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థుల కోసం రూపొందించిన ఈ క్యాలెండర్‌లో తరగతుల నిర్వహణ, పరీక్షల తేదీలు, సెలవులు, పాఠ్యేతర ప్రణాళికలను విద్యాశాఖ స్పష్టంగా పొందుపరిచింది.

తెలంగాణ స్కూల్ అకడమిక్ క్యాలెండర్ 2026-27
తెలంగాణ స్కూల్ అకడమిక్ క్యాలెండర్ 2026-27

ఈ విద్యాసంవత్సరంలో పాఠశాలలు మొత్తం 227 పనిదినాలపాటు నడవనున్నాయి. ఈ విద్యాసంవత్సరం చివరి పనిదినం 2027 ఏప్రిల్ 23గా నిర్ణయించారు. ఆ తర్వాతి రోజు, అనగా 2027 ఏప్రిల్ 24 నుంచి జూన్ 13 వరకు విద్యార్థులకు వేసవి సెలవులు ఉంటాయి.

పరీక్షల పూర్తి షెడ్యూల్

విద్యార్థుల ప్రగతిని అంచనా వేసేందుకు విద్యాశాఖ ఫార్మేటివ్ (FA), సమ్మేటివ్ (SA) పరీక్షల షెడ్యూల్‌ను కింది విధంగా ప్రకటించింది.

  • ఫార్మేటివ్ అసెస్‌మెంట్-1 (FA-1): 2026 జూలై 31 లోపు పూర్తి చేయాలి.
  • ఫార్మేటివ్ అసెస్‌మెంట్-2 (FA-2): సెప్టెంబర్ 21 లోపు నిర్వహించాలి.
  • సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 (SA-1): అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 9 వరకు జరుగుతాయి.
  • ఫార్మేటివ్ అసెస్‌మెంట్-3 (FA-3): డిసెంబర్ 10 లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.
  • ఫార్మేటివ్ అసెస్‌మెంట్-4 (FA-4): పదో తరగతి విద్యార్థులకు 2027 జనవరి 27 లోపు, అలాగే 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 15 లోపు పూర్తి చేయాలి.
  • పదో తరగతి ప్రీ-ఫైనల్స్: 2027 ఫిబ్రవరి 28 లోపు ముగుస్తాయి.
  • పదో తరగతి బోర్డు పరీక్షలు (SSC Exams 2027): 2027 మార్చి నెలలో నిర్వహించనున్నారు.
  • సమ్మేటివ్ అసెస్‌మెంట్-2 (SA-2): 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు 2027 ఏప్రిల్ 9 నుండి ఏప్రిల్ 19 వరకు జరుగుతాయి.

పండుగ సెలవుల వివరాలు

ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థులకు మూడు ప్రధాన పండుగ సెలవుల కాలాన్ని విద్యాశాఖ కేటాయించింది.

  • దసరా సెలవులు: 2026 అక్టోబర్ 10 నుండి అక్టోబర్ 22 వరకు (మొత్తం 13 రోజులు).
  • క్రిస్మస్ సెలవులు: మిషనరీ పాఠశాలలకు డిసెంబర్ 23 నుండి డిసెంబర్ 27 వరకు.
  • సంక్రాంతి సెలవులు: 2027 జనవరి 13 నుండి జనవరి 17 వరకు.

క్రీడలు, యోగా తప్పనిసరి

కేవలం చదువే కాకుండా విద్యార్థుల శారీరక, మానసిక ఉల్లాసం కోసం ప్రతిరోజూ పాఠశాలల్లో క్రీడా కార్యకలాపాలను నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. ఉదయం ప్రార్థనా సమయం ముగిసిన తర్వాత లేదా అసెంబ్లీ సమయంలోనే రోజూ యోగా, ధ్యానం సెషన్లను నిర్వహించడం తప్పనిసరి చేశారు.

చదువులో వెనుకబడిన 1 నుంచి 9వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహించే రెమెడియల్ (సవరణ) తరగతులు సెప్టెంబర్ చివరి వరకు కొనసాగుతాయి. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన అన్ని ముఖ్యమైన దినోత్సవాలను పాఠశాలల్లో ఘనంగా నిర్వహించాలని, తద్వారా విద్యార్థులకు సామాజిక స్పృహ కల్పించాలని స్పష్టం చేశారు.

కింద పీడీఎఫ్‌లో పూర్తి వివరాలు చూడండి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More