TG SET Hall Tickets 2026 : టీజీ సెట్ హాల్ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి
TG SET Hall Tickets 2026 : తెలంగాణ సెట్ (TG SET) 2024 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్( https://tgset.aptonline.in/ ) ద్వారా హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Telangana SET Hall Tickets 2026 : రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్ల అర్హత కోసం నిర్వహించే ‘తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్’ (TG SET 2024) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి నేరుగా తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈ ఏడాది టీజీ సెట్ పరీక్ష బాధ్యతలను పర్యవేక్షిస్తోంది. కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో (CBT) ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి వెళ్లే సమయంలో హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ఒక ఒరిజినల్ ప్రభుత్వ గుర్తింపు కార్డును (ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, లేదా ఓటర్ ఐడీ) తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది.
హాల్ టికెట్ డౌన్లోడ్ ఇలా…
- ముందుగా అధికారిక పోర్టల్ https://tgset.aptonline.in/TGSET/GetHallTicketApplication.aspx ను ఓపెన్ చేయండి.
- హోమ్ పేజీలో కనిపించే 'Download Hall Ticket' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్ట్రేషన్ నంబర్, పేమెంట్ రిఫరెన్స్ ఐడీ,మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయండి.
- గెట్ హాల్ టికెట్ పై క్లిక్ చేస్తే మీకు హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ పొందొచ్చు.
పరీక్ష సమయానికి కనీసం గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారు సూచించారు. చివరి నిమిషంలో హడావుడి లేకుండా ముందే హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, దానిలోని వివరాలను (పేరు, ఫోటో, పరీక్ష కేంద్రం అడ్రస్) సరిచూసుకోవడం మంచిది.
టీజీ సెట్ - సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ ఇలా :
- సెప్టెంబర్ 28, 2026 (సోమవారం) : షిఫ్ట్-1: జియోగ్రఫీ, హిందీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, లైఫ్ సైన్సెస్, సంస్కృతం. షిఫ్ట్-2: ఎడ్యుకేషన్, లింగ్విస్టిక్స్, తెలుగు, ఉర్దూ.
- సెప్టెంబర్ 29, 2026 (మంగళవారం):షిఫ్ట్-1: కామర్స్, హిస్టరీ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, మేనేజ్‌మెంట్, ఫిలాసఫీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, సోషియాలజీ. షిఫ్ట్-2: ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్.
- సెప్టెంబర్ 30, 2026 (బుధవారం):షిఫ్ట్-1: కెమికల్ సైన్సెస్, ఎర్త్ సైన్సెస్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సోషల్ వర్క్. షిఫ్ట్-2: కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఇంగ్లీష్, లా .
ఈ అర్హత పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పరీక్షను రెండు విభాగాలుగా నిర్వహిస్తారు. పరీక్ష రాయడానికి అభ్యర్థులకు మొత్తం 3 గంటల (180 నిమిషాలు) సమయం ఇస్తారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

