TG SSC Results 2026 : తెలంగాణ టెన్త్ ఫలితాలపై కసరత్తు - మే మొదటి వారంలో రిజల్ట్స్...!

Telangana SSC Results 2026 : తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈనెల 16వ తేదీ నాటికి అన్ని సబ్జెక్టులు పూర్తవుతాయి. మరోవైపు స్పాట్ వాల్యూయేషన్ ప్రారంభమైంది. మే మొదటి వారంలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. 

Published on: Apr 08, 2026 12:20 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. గతేడాదికి భిన్నంగా ఈసారి షెడ్యూల్ ఉండగా… విద్యార్థులకు చాలా సమయం ఇచ్చారు. ప్రతి పరీక్షకు మధ్యలో మూడు నుంచి నాలుగు రోజుల పాటు గడువు ఇచ్చారు. ఫలితంగా నెల రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి.

తెలంగాణ పదో తరగతి పరీక్షలు 2026
తెలంగాణ పదో తరగతి పరీక్షలు 2026

గత మార్చి 14వ తేదీన తెలంగాణ పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 7వ తేదీన బయాలజీ పేపర్ పూర్తి అయింది. మిగతా సబ్జెక్టులన్నీ కలిపి ఏప్రిల్ 16వ తేదీతో పూర్తవుతాయి.

స్పాట్ వాల్యూయేషన్ ప్రారంభం…!

ఓవైపు పరీక్షలు జరుగుతుండగానే… మరోవైపు స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కాగా… ఏప్రిల్ 23వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత ఫలితాలను ప్రాసెస్ చేస్తారు. సాంకేతిక అంశాలను పరిశీలిస్తారు. అంతా ఒకే అనుకుంటే… ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు పంపుతుంది. సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే… అధికారికంగా ఓ తేదీని ఖరారు చేస్తారు.

తెలంగాణ టెన్త్ ఫలితాలు ఎప్పుడు రావొచ్చు..?

ప్రాథమిక అంచనాల ప్రకారం…. తెలంగాణ పదో తరగతి ఫలితాలు మే మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్ 23 నాటికి స్పాట్ పూర్తి అయితే… మరో వారం రోజుల పాటు క్రీడకరణ ఉంటుంది. అంటే ఏప్రిల్ చివరికల్లా మొత్తం ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మే మొదటి వారంలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంటుంది. మే 4 లేదా 5 తేదీలు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారికంగా ప్రభుత్వ పరీక్ష విభాగం నుంచి ప్రకటన రానుంది.

టెన్త్ ఫలితాలను ఎక్కడ చెక్ చేసుకోవాలి..?

తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదలైన తర్వాత https://bse.telangana.gov.in వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా హిందుస్తాన్ టైమ్స్ వెబ్ సైట్ ( https://www.hindustantimes.com/telugu ) లోనూ అందుబాటులో ఉంటాయి. విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా మార్కుల వివరాలను వేగంగా తెలుసుకోవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More