...
...
Next Story

తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే!

TS 10th Supplementary Results 2026 : తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు 2026 విడుదల అయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

Published on: Jun 25, 2026, 15:33:46 IST
Advertisement

తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలు విడుదల అయ్యాయి. హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. విద్యార్థులు తమ మార్కుల మెమోలను ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఈ ఏడాది జూన్ 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారితో పాటు, మార్కులు తక్కువగా వచ్చి స్కోర్ పెంచుకోవాలనుకున్న (ఇంప్రూవ్‌మెంట్) విద్యార్థులు కూడా ఈ పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులు పైచదువులకు ఇబ్బంది పడకుండా ఉండేందుకు విద్యాశాఖ కేవలం కొద్దిరోజుల్లోనే సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని పూర్తి చేసి ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది లేకుండా కింద పేర్కొన్న పద్ధతి ద్వారా తమ మార్కులను మొబైల్ లేదా కంప్యూటర్‌లో చూసుకోవచ్చు.

ఫలితాలు చూసుకోవడం ఎలా?

ముందుగా తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ అయిన bse.telangana.gov.in ఓపెన్ చేయండి.

హోమ్‌పేజీలో అందుబాటులో ఉండే "SSC ASE Examinations June 2026 Results" అనే లింక్‌పై క్లిక్ చేయండి.

కొత్త పేజీలో మీ టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ హాల్ టికెట్ నంబర్ (Hall Ticket Number) ఎంటర్ చేయండి.

వివరాలు ఇచ్చాక 'Submit' బటన్‌పై క్లిక్ చేయాలి. మీ మార్కుల మెమో స్క్రీన్‌పై కనిపిస్తుంది. భవిష్యత్తు అవసరాల కోసం దాన్ని ప్రింట్ లేదా పీడీఎఫ్ రూపంలో సేవ్ చేసుకోండి.

ఈ లింక్ క్లిక్ చేసి ఫలితాలు చెక్ చేసుకోండి.

ఇంటర్ ప్రవేశాల గడువు ముగియక ముందే ఈ ఫలితాలను విడుదల చేయడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఫలితాల్లో మార్కులపై ఏవైనా సందేహాలు ఉంటే, రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ దరఖాస్తుల వివరాలను, గడువు తేదీలను అధికారులు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks