Glass Of Water : మండుతున్న ఎండలు.. గిగ్ వర్కర్లకు ఒక గ్లాసు నీళ్లు అందించండి
Glass Of Water : తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. బయట అడుగుపెట్టాలంటే భయం భయంగా ఉంది. ఇలాంటి సమయంలో గిగ్ వర్కర్లు డెలివరీలు చేస్తున్నారు. వారికి గ్లాస్ నీరు అందించాలని గిగ్ వర్కర్స్ యూనియన్ విజ్ఞప్తి చేసింది.
తెలంగాణలో వేసవిలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల నుంచి 45 డిగ్రీల మధ్య ఉంటున్న నేపథ్యంలో తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్(TGPWU) గిగ్ వర్కర్ల కోసం #GlassOfWaterCampaignను ప్రారంభించింది. ఫుడ్ డెలివరీ, కిరాణా డెలివరీ, రవాణా వంటి సేవలను అందిస్తూ, అధిక ఉష్ణోగ్రతలలో ఆరుబయట నిరంతరం పనిచేస్తున్న డెలివరీ కార్మికులు, క్యాబ్ డ్రైవర్ల పని గురించి గుర్తు చేసింది. దీంతో ఈ క్యాంపెయిన్ మెుదలుపెట్టింది.

వేడిని తట్టుకోవడంలో వారికి సహాయపడేలా.. గిగ్ వర్కర్లకు ఒక గ్లాసు నీళ్లు అందించాలని TGPWU ప్రజలకు కోరింది. 'బయట 43 డిగ్రీల నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పుడు.. రోజంతా ఆ ఎండలో నిలబడి మీకు ఆహారాన్ని అందించడం లేదా మిమ్మల్ని సురక్షితంగా తీసుకువెళ్లడం వంటివి చేస్తుంటారు. వారు పెద్దగా ఏమీ అడగరు. కేవలం గౌరవం, అప్పుడప్పుడు ఒక గ్లాసు నీళ్లు మాత్రమే ఇవ్వండి. మీరు చేసే ఒక చిన్న సహాయం కూడా ఎంతో విలువైనది.' అని TGPWU వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ అన్నారు.
వేసవి కాలంలో డెలివరీ కార్మికులకు, క్యాబ్ డ్రైవర్లకు నీటిని అందించడం ద్వారా ఈ క్యాంపెయిన్‌లో పాల్గొనాలని నివాసితులకు, రెస్టారెంట్లకు, వ్యాపారాలకు యూనియన్ విజ్ఞప్తి చేసింది. వేసవిలో బహిరంగ ప్రదేశాలలో పనిచేసే గిగ్ వర్కర్లకు తాగునీరు అందించడం వంటి సాధారణ చర్యలను ప్రోత్సహించడంపై ఈ ప్రచారం ఫోకస్ చేస్తోంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


