TG TET 2027 Application : తెలంగాణ టెట్ అప్డేట్ - నేటి నుంచే దరఖాస్తులు ప్రారంభం, ముఖ్య తేదీలు
ఇవాళ్టి నుంచి తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET - జనవరి 2027) ఆన్‌లైన్ దరఖాస్తులు షురూ అవుతాయి. డిసెంబర్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. జనవరి 3 నుంచి 15 వరకు కంప్యూటర్ ఆధారిత (CBT) పరీక్షలు జరుగుతాయి.
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET - జనవరి 2027) ఆన్‌లైన్ దరఖాస్తులు నేటి నుంచి మొదలవుతాయి. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పరీక్షలు.... జనవరి 3 నుంచి 15 వరకు జరుగుతాయి.

- ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు, దరఖాస్తులకు చివరి తేదీ : డిసెంబర్ 10, 2026
- హాల్ టికెట్ల డౌన్‌లోడ్ : డిసెంబర్ 28, 2026 నుంచి
- TG TET పరీక్షల తేదీలు : జనవరి 3, 2027 నుంచి జనవరి 15, 2027 వరకు
- ఫలితాల విడుదల: ఫిబ్రవరి రెండో వారం (ఫిబ్రవరి 8 నుంచి 12, 2027 మధ్యలో)
తెలంగాణ టెట్ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)గా నిర్వహిస్తారు. రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఉదయం సెషన్ 9:00 గంటల నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2:00 గంటల నుంచి 4:30 గంటల వరకు ఉంటుంది. ప్రతి పేపర్ పరీక్ష సమయం 2 గంటల 30 నిమిషాలు. మొత్తం 150 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది.
- పేపర్-1 (Paper-I): 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు (ప్రైమరీ స్కూల్) బోధించాలనుకునే అభ్యర్థుల కోసం.
- పేపర్-2 (Paper-II): 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు (అప్పర్ ప్రైమరీ) బోధించాలనుకునే అభ్యర్థుల కోసం.
- అర్హత కలిగిన అభ్యర్థులు 1 నుంచి 8వ తరగతి వరకు బోధించేందుకు వీలుగా రెండు పేపర్లకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
కేటగిరీల వారీగా పరీక్ష ఫీజు వివరాలను విద్యాశాఖ వెల్లడించింది. జనరల్, బీసీ అభ్యర్థులు ఏదైనా ఒక పేపర్‌కు రూ. 750, రెండు పేపర్లకు కలిపి రూ. 1,000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఒక పేపర్‌కు రూ. 700, రెండు పేపర్లకు కలిపి రూ. 950 ఫీజుగా నిర్ణయించారు.
డీఎల్‌ఈడీ , డీఈడీ , బీఈడీ , లాంగ్వేజ్ పండిట్ కోర్సులు పూర్తి చేసిన వారితో పాటు, ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా టెట్ రాయడానికి అర్హులు. గతంలో టెట్ క్వాలిఫై అయిన వారు తమ స్కోరు పెంచుకోవడానికి (ఇంప్రూవ్‌మెంట్) మరోసారి అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, గురుకులాలు, మోడల్ స్కూళ్లు, ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్-సర్వీస్ టీచర్లకు కూడా అవకాశం కల్పించారు.
టెట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ జీవితకాలం చెల్లుబాటు అవుతుందని విద్యాశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో నిర్వహించే ఉపాధ్యాయ నియామక పరీక్షలో టెట్ స్కోరుకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. పరీక్షలో క్వాలిఫై కావడానికి జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 60 శాతం, బీసీలు 50 శాతం, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు 40 శాతం ఆపై మార్కులు సాధించాలి. పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ బులెటిన్, సిలబస్, ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం అభ్యర్థులు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in ను సందర్శించాలి. సందేహాల కోసం పనిదినాల్లో 7093708883, 7093708884, 7093958881, 7093468882 హెల్ప్ డెస్క్ నంబర్లను సంప్రదించవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

