...
...
Next Story

TG TET Notification 2026 : టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు అప్డేట్ - త్వరలోనే టెట్ నోటిఫికేషన్..!

Telangana TET Notification 2026 : డీఎడ్, బీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది.. ఈ నెలాఖరులో తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నోటిఫికేషన్ విడుదల కానుంది. జనవరిలో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

Published on: Nov 6, 2026, 14:50:47 IST
Advertisement

Telangana TET Notification 2026 : డీఎడ్, బీఎడ్ పూర్తి చేసినవారితో పాటు టెట్ రాసేందుకు ఎదురుచూస్తున్న అభ్యర్థులకు అప్డేట్ వచ్చేసింది. త్వరలోనే కొత్త నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు విద్యాశాఖ కసరత్తు షురూ చేసింది. ప్రాథమిక సమాచారం మేరకు… ఈ నెలాఖరులోగా రెగ్యులర్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) నోటిఫికేషన్ విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ అప్డేట్స్
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ అప్డేట్స్

సాధారణంగా నవంబరు మొదటి వారంలోనే ఈ టెట్ నోటిఫికేషన్ రావాల్సి ఉంది. అయితే ఈసారి ఇప్పటికే విధుల్లో ఉన్న ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు రెండో టెట్ పరీక్షలను నిర్వహిస్తుండటంతో రెగ్యులర్ నోటిఫికేషన్ జారీలో కొంత ఆలస్యం జరిగింది.

ఈనెలాఖరులోగా నోటిఫికేషన్…!

ఈ నెలాఖరులో రెగ్యులర్ టెట్ ప్రకటనను జారీ చేసేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. అభ్యర్థుల దరఖాస్తు స్వీకరణ, పరీక్షల నిర్వహణ తేదీలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. నోటిఫికేషన్ ఈనెలాఖారులోగా జారీ చేసిన తర్వాత…. వచ్చే ఏడాది జనవరి నెలలో కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ విధానంలో (CBT) పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో ఉపాధ్యాయ కొలువుల కోసం సిద్ధమవుతున్న వేలాది మంది డీఎడ్, బీఎడ్ అభ్యర్థులకు ఊరట లభించనుంది.

తెలంగాణ టెట్ పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు బోధించాలనుకునే వారు పేపర్-1, ఆరు నుంచి ఎనిమిదవ తరగతి వరకు బోధించాలనుకునే వారు పేపర్-2 రాయాల్సి ఉంటుంది. రెండు పేపర్లలోనూ 150 మార్కులకు గానూ 150 ప్రశ్నలు ఇస్తారు. సమయం రెండున్నర గంటలు ఉంటుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks