Telangana Teacher Eligibility Test 2026 : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ్టి (ఏప్రిల్ 15) నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు.

టీజీ టెట్ పరీక్షలు జూన్ 15 నుంచి ప్రారంభమవుతాయి. జూన్ 30, 2026 వరకు వివిధ విడతల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థుల సంఖ్య, విడతలను బట్టి పరీక్షా కేంద్రాలను కేటాయించనున్నారు. ఈ ఏడాది టీజీ టెట్ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) పద్ధతిలో ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తారు.
అర్హులైన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు, సిలబస్ తో పాటు అర్హత ప్రమాణాలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్ సైట్ లో ఉంటాయి.
జనరల్, బీసీ అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ. 750, రెండు పేపర్లకు కలిపి రూ. 1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులు అయితే ఒక పేపర్‌కు రూ. 700, రెండు పేపర్లకు కలిపి రూ. 950 చెల్లించాల్సి ఉంటుంది.
టీజీ టెట్ 2026 - దరఖాస్తు విధానం :
- ముందుగా https://tgtet.aptonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని అప్లికేషన్ ఫీజు లింక్ పై క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి.
- ఆ తర్వాత అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేస్తే ఫామ్ ఓపెన్ అవుతుంది.
- మీ వివరాలతో పాటు ఫొటో, సంతకం కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
- చివరగా సబ్మిట్ చేస్తే మీ టెట్ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ కాపీని పొందొచ్చు.
తెలంగాణ టెట్ 2026 నోటిఫికేషన్ - ముఖ్యమైన వివరాలు:
- దరఖాస్తుల ప్రారంభం: ఏప్రిల్ 15, 2026
- దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2026
- హాల్ టికెట్ల డౌన్‌లోడ్: జూన్ 9, 2026 నుంచి అందుబాటులోకి వస్తాయి.
- పరీక్ష తేదీలు - జూన్ 15, 2026 నుంచి జూన్ 30, 2026 మధ్య జరుగుతాయి.
- టెట్ ఫలితాల వెల్లడి: జూలై 28 నుంచి 31 మధ్య ప్రకటించే అవకాశం ఉంది.
టీజీ టెట్ ప్రధానంగా రెండు పేపర్లుగా ఉంటుంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించాలనుకునే అభ్యర్థులు పేపర్-1 రాయాలి. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించే వారు పేపర్-2 పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. డీఈడీ, బీఈడీ, లాంగ్వేజ్ పండిట్ లేదా తత్సమాన కోర్సులు పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గతంలో టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు తమ స్కోర్‌ను మెరుగుపరుచుకోవడానికి మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు.
{{/usCountry}}టీజీ టెట్ ప్రధానంగా రెండు పేపర్లుగా ఉంటుంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించాలనుకునే అభ్యర్థులు పేపర్-1 రాయాలి. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించే వారు పేపర్-2 పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. డీఈడీ, బీఈడీ, లాంగ్వేజ్ పండిట్ లేదా తత్సమాన కోర్సులు పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గతంలో టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు తమ స్కోర్‌ను మెరుగుపరుచుకోవడానికి మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు.
{{/usCountry}}టెట్ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధిస్తే ఏ డీఎస్సీ పరీక్షనైనా రాసుకోవచ్చు. అర్హత సాధించిన అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా టెట్ రాయవచ్చు. ఎక్కువ స్కోర్ ఉన్న టెట్ పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 150 మార్కులకు ఈ ఎగ్డామ్ నిర్వహిస్తారు. ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న టీచర్లకు కూడా టెట్ తప్పనిసరి కావడంతో చాలా మంది హాజరయ్యే అవకాశం ఉంటుంది.