TG TET 2027 Mock Test : తెలంగాణ టెట్ అభ్యర్థులకు అప్డేట్ - మాక్ టెస్టులు ప్రారంభం, ఇదిగో లింక్

తెలంగాణ టెట్ 2027 జనవరి సెషన్ అభ్యర్థుల కోసం ఉచిత మాక్ టెస్టులు అందుబాటులోకి వచ్చాయి. పాస్‌వర్డ్ లేకుండానే వెబ్‌సైట్‌లో లాగిన్ అయి సీబీటీ విధానాన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు.

Published on: Nov 27, 2026, 09:13:33 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తెలంగాణ టెట్ (TG TET) 2027 జనవరి సెషన్ కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు విద్యాశాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సౌలభ్యం కోసం మాక్ టెస్టులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆన్‌లైన్ పరీక్షా విధానంపై అభ్యర్థులకు పూర్తి అవగాహన కల్పించడంతో పాటు, నిర్ణీత సమయంలో పరీక్షను ఎలా పూర్తి చేయాలో అలవర్చుకునేలా అధికారిక వెబ్‌సైట్‌లో ఈ సదుపాయాన్ని కల్పించింది.

తెలంగాణ టెట్ జనవరి సెషన్ - 2027
తెలంగాణ టెట్ జనవరి సెషన్ - 2027

టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://tgtet.aptonline.in/ ద్వారా ఈ మాక్ టెస్టులను రాయవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో పరీక్ష రాసేటప్పుడు అభ్యర్థులు ఎలాంటి తప్పులు చేయకుండా, ప్రశాంతంగా ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు ఈ మోడల్ టెస్టులు ఎంతో ఉపయోగపడతాయి.

తొలిసారి కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చుని పరీక్ష రాసేవారికి సమయం సరిపోకపోవడం తరచూ ఎదురయ్యే పెద్ద సమస్య. ప్రశ్నలు చదవడం, ఆప్షన్లు ఎంచుకోవడం, సబ్మిట్ చేయడం వంటి ప్రక్రియల్లో సమయం వృథా కాకుండా చూసేందుకు విద్యాశాఖ ఈసారి ముందే మాక్ టెస్టుల లింకులను తెరిచింది. నెట్ సెంటర్లు లేదా సొంత ల్యాప్‌టాప్‌ల సాయంతో అభ్యర్థులు వీటిని పూర్తిగా ఉచితంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.

టీజీ టెట్ మాక్ టెస్ట్ ఎలా రాయాలి?

  • ముందుగా https://tgtet.aptonline.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
  • హోమ్ పేజీలో కనిపించే 'మాక్ టెస్ట్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు కొత్త విండో ఓపెన్ అవుతుంది. అందులో సైన్ ఇన్ కావాలి.
  • ఎలాంటి పాస్‌వర్డ్ అవసరం లేకుండానే సైన్ ఇన్ అయి ఉచిత మాక్ టెస్టులను రాయవచ్చు.
  • ఈ మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా విధానంతో పాటు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే విషయంలో అభ్యర్థులకు స్పష్టత వస్తుంది.
  • ప్రధాన పరీక్షకు ముందు ఈ ప్రాక్టీస్ అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

జనవరి సెషన్ - 2027 ముఖ్య తేదీలు ఇవే:

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు, దరఖాస్తులకు చివరి తేదీ : డిసెంబర్ 10, 2026

హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం : డిసెంబర్ 28, 2026 నుంచి

TG TET పరీక్షల తేదీలు : జనవరి 3, 2027 నుంచి జనవరి 15, 2027 వరకు

ఫలితాల విడుదల : ఫిబ్రవరి రెండో వారం (ఫిబ్రవరి 8 నుంచి 12, 2027 మధ్యలో)

రాష్ట్రంలో నిర్వహించే ఉపాధ్యాయ నియామక పరీక్షలో టెట్ స్కోరుకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. పరీక్షలో క్వాలిఫై కావడానికి జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 60 శాతం, బీసీలు 50 శాతం, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు 40 శాతం ఆపై మార్కులు సాధించాలి. సందేహాల కోసం పనిదినాల్లో 7093708883, 7093708884, 7093958881, 7093468882 హెల్ప్ డెస్క్ నంబర్లను సంప్రదించవచ్చు.

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.