...
...
Next Story

ఆసుపత్రుల్లో ఇక గంటల తరబడి వేచి ఉండక్కర్లేదు.. తెలంగాణలోని ఆసుపత్రులలో హెల్త్ ఏటీఎంలు!

Health ATMs : తెలంగాణలోని ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది.

Published on: Apr 5, 2026, 20:17:11 IST
Advertisement

రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో ఔట్‌పేషెంట్లు ఉండే ఆసుపత్రులలో హెల్త్ ఏటీఎంలు అని పిలిచే ర్యాపిడ్ డయాగ్నస్టిక్ టెస్టింగ్ మెషీన్‌లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. పైలట్ ప్రాతిపదికన పరీక్షించిన ఈ ప్రాజెక్టు సానుకూల ఫలితాలను చూపించిందని, దీంతో దీనిని విస్తృతంగా అమలు చేసే ప్రణాళికలు వేగవంతమయ్యాయని అధికారులు తెలిపారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

రద్దీగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రులలో రోగ నిర్ధారణ సేవలను బలోపేతం చేయడానికి.. 2025 ఆగస్టులో కింగ్ కోటి జిల్లా ఆసుపత్రి, మలక్‌పేట్ ఏరియా ఆసుపత్రిలో హెల్త్ ఏటీఎంలను ప్రారంభించారు. ప్రతి యూనిట్ 65 నాన్-ఇన్వాసివ్, 20 ఇన్వాసివ్ (రక్త ఆధారిత) పరీక్షలతో సహా 130 పరీక్షలను ఇక్కడ జరుగుతాయి. వీటి ఫలితాలు క్లౌడ్ కనెక్టివిటీ ద్వారా డిజిటల్ ఆరోగ్య రికార్డులలో పొందుపరుస్తారు.

ప్రీ-కన్సల్టేషన్ స్క్రీనింగ్‌ను సులభతరం చేయడం, రోగుల వెయిట్ చేయాల్సిన సమయాన్ని తగ్గించడం, రోగ నిర్ధారణ కచ్చితత్వాన్ని మెరుగుపరచడం ఈ యంత్రాల లక్ష్యమని అధికారులు వెల్లడించారు. పైలట్ దశలో కచ్చితత్వాన్ని ధృవీకరించడానికి.. ఆసుపత్రి సిబ్బంది ఏటీఎంలలో పరీక్షలు చేయించుకున్న రోగుల నుండి రక్త నమూనాలను సేకరించి T-డయాగ్నోస్టిక్స్‌కు పంపారు. అదే సమయంలో కొన్ని నమూనాలను ప్రైవేట్ డయాగ్నోస్టిక్ కేంద్రాలలో కూడా పరీక్షించారు.

ఫలితాలు సరిపోలాయని, యంత్రాల పనితీరు విశ్వసనీయంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించారు అధికారులు. ఔట్ పేషెంట్ విభాగాలలో రద్దీని తగ్గించడం, రోగ నిర్ధారణ సేవలను మెరుగుపరచడం, నిరీక్షణ సమయాన్ని తగ్గించడం, డిజిటల్ రికార్డుల ద్వారా సంరక్షణ కొనసాగింపును నిర్ధారించడం వంటి పారామితులపై కూడా ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను సమగ్రంగా రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి పంపింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe