నవంబర్ 22 నుండి పోచంపల్లికి వన్ డే టూర్ ప్యాకేజీ.. ధర ఎంత? ఎలా బుక్ చేయాలి?

A Day to Pochampally : తెలంగాణ పర్యాటక శాఖ సరికొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. పోచంపల్లికి వన్ డే టూర్ ప్యాకేజీని ప్రకటించింది.

Published on: Nov 20, 2026, 16:52:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తెలంగాణ పర్యాటక శాఖ నవంబర్ 22 నుండి ఏ డే టు పోచంపల్లి(A Day to Pochampally) పేరుతో ఒక ప్రత్యేకమైన ఒకరోజు పర్యటన ప్యాకేజీని ప్రారంభిస్తోంది. దీని ద్వారా సందర్శకులు రాష్ట్రంలోని గొప్ప చేనేత వారసత్వాన్ని అన్వేషించవచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లికి చెందిన సాంప్రదాయ ఇక్కత్(Ikat) నేత పద్ధతులను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు.

పోచంపల్లి వన్ డే టూర్
పోచంపల్లి వన్ డే టూర్

ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం పోచంపల్లికి పేరుగాంచిన చేనేత సంప్రదాయాన్ని ప్రోత్సహించడం, స్థానిక నేత కార్మికుల నైపుణ్యాన్ని సందర్శకులు దగ్గరగా చూసి తెలుసుకునేలా చేయడం. ఈ పర్యటనలో భాగంగా శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించడం, ఆ తర్వాత హరిత పోచంపల్లి హోటల్‌లో భోజనం చేయడం ఉంటాయి. ఇక్కడ స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన సాంప్రదాయ వంటకాలను వడ్డిస్తారు. అలాగే సందర్శకులను తెలంగాణ పర్యాటక శాఖకు చెందిన ఇక్కత్ మ్యూజియానికి తీసుకెళ్తారు. అక్కడ వారు పోచంపల్లి నేత కళా చరిత్రను, దాని తయారీ పద్ధతులను తెలుసుకోవచ్చు.

ఈ ప్యాకేజీలో భాగంగా స్థానిక నేత కార్మికులతో మాట్లాడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒక ప్రత్యేక వర్క్‌షాప్ ద్వారా నేత పని, దారాలను ముడివేయడం, రంగులు అద్దడం వంటి సాంప్రదాయ ప్రక్రియలను సందర్శకులు స్వయంగా చూడవచ్చు. పర్యటన చివరలో షాపింగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది, దీని ద్వారా సందర్శకులు అసలైన పోచంపల్లి చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.

తెలంగాణ పర్యాటక శాఖ అందిస్తున్న ఈ పోచంపల్లి పర్యటన ప్యాకేజీలో స్థానిక నేత కార్మికులతో సంభాషించే అవకాశం ఉంది.

ఈ ప్యాకేజీలో ఏసీలో ట్రావెలింగ్, భోజనం, అల్పాహారాలు, ఆలయ దర్శనం, ప్రవేశ టిక్కెట్లు, నేత వర్క్‌షాప్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. ఒక్కో వ్యక్తికి రూ.2,100, పిల్లలకు రూ.1,680 ధర నిర్ణయించారు. తెలంగాణ పర్యాటక శాఖ వెబ్‌సైట్ ద్వారా ఈ పర్యటనను బుక్ చేసుకోవచ్చు. బుకింగ్‌లు, మరిన్ని వివరాల కోసం, సందర్శకులు బషీర్‌బాగ్‌లోని సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయాన్ని 9848540371 నంబర్‌లో, సికింద్రాబాద్‌లోని యాత్రి నివాస్‌లో ఉన్న సమాచార, రిజర్వేషన్ కార్యాలయాన్ని 9848126947 నంబర్‌లో, లేదా పర్యాటక భవన్‌ను 98483 06435 నంబర్‌లో సంప్రదించవచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More