రాష్ట్రంలో వాహనదారులకు రవాణా శాఖ అత్యంత కీలకమైన అప్డేట్ అందించింది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి జారీ చేసే చలాన్ల విధానంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులను అమలు చేయనుంది. కేంద్ర మోటారు వాహనాల నిబంధనల ప్రకారం డిజిటల్ మాధ్యమాలను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
వాట్సాప్, ఈ-మెయిల్‌కు చలాన్ నోటీసులు

కొత్త నిబంధనల ప్రకారం…. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులకు ఇకపై నేరుగా వారి మొబైల్ నంబర్లకు షార్ట్ మెసేజింగ్ సర్వీసెస్ (SMS), వాట్సాప్ (WhatsApp) లేదా వారి అధికారిక ఈ-మెయిల్ (e-mail) అడ్రస్‌లకు డిజిటల్ రూపంలో చలాన్ నోటీసులు అందుతాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలోని వాహన యజమానులందరూ ఈ నోటిఫికేషన్ విడుదలైన నెల రోజులలోపు తమ ప్రస్తుత మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని కేంద్ర ప్రభుత్వ రవాణా శాఖకు చెందిన 'వాహన్ పోర్టల్' (http://vahan.parivahan.gov.in) లో విధిగా అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గడువు ముగిసిన తర్వాత… వాహన్ పోర్టల్‌లో నమోదై ఉన్న మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్‌కు పంపే ఎస్‌ఎంఎస్, వాట్సాప్ సందేశాలనే వాహనదారుడికి చేరిన అధికారిక చలాన్ నోటీసులుగా రవాణా శాఖ పరిగణిస్తుంది. సమాచారం అందలేదనే నెపంతో తప్పించుకోవడానికి వీలుండదు.
ఎందుకు ఈ మార్పు?
గతంలో చలాన్ల సమాచారం సకాలంలో అందకపోవడం వల్ల వాహనదారులు పెనాల్టీలు పేరుకుపోయిన తరుణంలో ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు నేరుగా నిత్యం వాడే వాట్సాప్, ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం రావడం వల్ల వెంటనే చలాన్లను చెల్లించే అవకాశం కలుగుతుంది.
ఈ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని రవాణా శాఖ కమిషనర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP), హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, రిజిస్టరింగ్ అథారిటీలను ప్రభుత్వం ఆదేశించింది. వాహనదారులు ఎలాంటి జరిమానాలు, చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే వెంటనే తమ వివరాలను వాహన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడం మంచిది.
{{/usCountry}}ఈ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని రవాణా శాఖ కమిషనర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP), హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, రిజిస్టరింగ్ అథారిటీలను ప్రభుత్వం ఆదేశించింది. వాహనదారులు ఎలాంటి జరిమానాలు, చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే వెంటనే తమ వివరాలను వాహన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడం మంచిది.
{{/usCountry}}