గత నాలుగైదు రోజులుగా తెలంగాణలోని వాతావరణంలో చలి పెరిగింది. ప్రజలు ఉదయంపూట బయటకు వెళ్లాలంటే వణుకుతున్నారు. ఇక దుప్పట్లను బయటకు తీస్తున్నారు. ఆదివారం నుండి సోమవారం(నవంబర్ 9, 2026) ఉదయం 8:30 గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం, వివిధ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి.

తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ తాజా వాతావరణ నివేదిక ప్రకారం, ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 14.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, జనగామ జిల్లాల్లో 14.8 డిగ్రీలు, అలాగే నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో 14.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని ఉప్పల్ (మౌలాలీ) ప్రాంతంలో 15 డిగ్రీలు, హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లిలో 16.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నవంబర్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన సగటు కనిష్ట ఉష్ణోగ్రత 18.1 డిగ్రీలుగా ఉంది. గత ఏడాది నవంబర్ 18, 2025న సిర్పూర్ (కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా)లో అత్యల్పంగా 6.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
పాటించాల్సిన జాగ్రత్తలు
శీతాకాలంలో చల్లారిన ఆహారం కాకుండా ఎప్పటికప్పుడు వేడిగా ఉండే వంటకాలను తీసుకోండి. అల్లం, వెల్లుల్లి, పసుపు, మిరియాలు, దాచినచెక్క వంటి ద్రవ్యాలను ఆహారంలో చేర్చుకోండి. ఇవి శరీరంలో వేడిని పెంచి ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి.
ఉసిరి, నారింజ, నిమ్మ వంటి పండ్లను తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు రాకుండా ఉంటాయి. బాదం, వాల్‌నట్స్, నువ్వులు, వేరుశనగలు తినడం వల్ల శరీరానికి అవసరమైన మంచి కొవ్వులు, వేడి లభిస్తాయి. ఒకే రకమైన మందపాటి దుస్తులు ధరించే బదులు, కొన్ని పొరలుగా వస్త్రాలను ధరించడం వల్ల శరీర వేడి బయటకు పోకుండా ఉంటుంది. బయటకు వెళ్లేటప్పుడు మంకీ క్యాప్, కాటన్/వూలన్ సాక్స్ ధరించండి.
స్నానం చేసిన వెంటనే కొబ్బరి నూనె, గ్లిజరిన్ లేదా మంచి మోయిశ్చరైజింగ్ లోషన్ రాసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. అతిగా వేడిగా ఉండే నీటితో స్నానం చేస్తే చర్మం మరింత పొడిబారుతుంది. అందుకే గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించండి. పెదవులు పగలకుండా నెయ్యి లేదా లిప్ బామ్ రాసుకోండి. చలికాలంలో దాహం వేయకపోయినా శరీరానికి నీటి అవసరం ఉంటుంది. అందువల్ల గోరువెచ్చని నీటిని క్రమం తప్పకుండా తాగుతూ ఉండండి. ప్రతిరోజూ కాసేపు నడవటం లేదా యోగా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి శరీరం వెచ్చగా ఉంటుంది. రోజూ ఉదయం 15-20 నిమిషాలు లేత ఎండలో గడపడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్-డి లభిస్తుంది.
{{/usCountry}}స్నానం చేసిన వెంటనే కొబ్బరి నూనె, గ్లిజరిన్ లేదా మంచి మోయిశ్చరైజింగ్ లోషన్ రాసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. అతిగా వేడిగా ఉండే నీటితో స్నానం చేస్తే చర్మం మరింత పొడిబారుతుంది. అందుకే గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించండి. పెదవులు పగలకుండా నెయ్యి లేదా లిప్ బామ్ రాసుకోండి. చలికాలంలో దాహం వేయకపోయినా శరీరానికి నీటి అవసరం ఉంటుంది. అందువల్ల గోరువెచ్చని నీటిని క్రమం తప్పకుండా తాగుతూ ఉండండి. ప్రతిరోజూ కాసేపు నడవటం లేదా యోగా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి శరీరం వెచ్చగా ఉంటుంది. రోజూ ఉదయం 15-20 నిమిషాలు లేత ఎండలో గడపడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్-డి లభిస్తుంది.
{{/usCountry}}