తెలంగాణలో మరింత తగ్గిన ఉష్ణోగ్రతలు.. ఇక్కడ 11.3 డిగ్రీలు.. రాబోయే 2 రోజులు ఇలా
తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పట్టాయి. బుధ, గురువారాల్లో సంగారెడ్డిలో అత్యల్పంగా 11.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు 15.2 డిగ్రీల కంటే తక్కువగానే నమోదయ్యాయి.
తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ తాజా వాతావరణ నివేదిక ప్రకారం.. సంగారెడ్డిలో 11.3 డిగ్రీలు, రంగారెడ్డిలో 11.4, వికారాబాద్‌లో 11.7, మహబూబ్‌నగర్‌లో 12.0, ఆసిఫాబాద్‌లో 12.2, నాగర్‌కర్నూల్‌లో 12.4, సిద్దిపేట, కామారెడ్డిలలో 12.7, రాజన్న సిరిసిల్లలో 12.8, మెదక్‌లో 13.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

నవంబర్ 11, 12 తేదీల మధ్య ఉదయపు వేళల్లో నమోదైన జిల్లా వారీ కనిష్ట ఉష్ణోగ్రతలు ఇవే చూస్తే.. సంగారెడ్డి - 11.3 డిగ్రీలు, రంగారెడ్డి - 11.4, వికారాబాద్ - 11.7, మహబూబ్‌నగర్ - 12.0, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ - 12.2, నాగర్‌కర్నూల్ - 12.4, సిద్దిపేట - 12.7, కామారెడ్డి - 12.7, రాజన్న సిరిసిల్ల - 12.8, మెదక్ - 13.1 డిగ్రీలు నమోదయ్యాయి.
రంగారెడ్డితో పాటు, రాష్ట్రంలోని ఇతర పట్టణ జిల్లాల్లో కూడా చలి తీవ్రత పెరిగింది. మేడ్చల్-మల్కాజ్‌గిరిలో 13.2 డిగ్రీల, హైదరాబాద్‌లో 15.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉంటున్నాయి. రంగారెడ్డి 11.4, మేడ్చల్ మల్కాజిగిరి 13.2, హైదరాబాద్ 15.1 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టుగా అధికారులు తెలిపారు.
భారత వాతావరణ శాఖ(IMD) హైదరాబాద్ కేంద్రం తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. రాబోయే రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల నుండి 3 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే 48 గంటల్లో హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సుమారు 32 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు సుమారు 17 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఉత్తర దిశ నుండి వీచే చల్లని గాలుల స్థానంలో తూర్పు దిశ నుండి వీచే గాలులు రానున్నాయి. తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ(TGDPS) వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం మరికొన్ని రోజుల్లో వాతావరణం మారనుంది.
తూర్పు దిశ నుండి బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో గాలిలో తేమ పెరిగి మేఘావృతమైన వాతావరణం ఏర్పడనుంది. దీనివల్ల పగటి ఉష్ణోగ్రతలు తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటాయి. రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం, మిగిలిన శీతాకాలంలో తీవ్రమైన చలి ఉండే అవకాశం లేదు అని నిపుణులు అంటున్నారు.
రాబోయే రోజుల్లో అనుకున్నస్థాయిలో వర్షాలు కురిసే అవకాశాలు తక్కువే. సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో వర్షపాతం తక్కువగా ఉంటుంది. అక్టోబర్ నెలలో కూడా రాష్ట్రంలో దాదాపు పొడి వాతావరణమే నమోదైంది. ఇటీవల ఏర్పడిన రెండు తుపానులతో రాష్ట్రం మెుత్తం ఆశించిన వర్షాలు కురవలేదు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కొమురం భీమ్ వంటి కొన్ని జిల్లాలు మాత్రమే వర్షాలు పడ్డాయి.
నవంబర్ 13 ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే నవంబర్ 19-20 తేదీల ప్రాంతంలో దక్షిణ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో అక్టోబర్‌లో 86 శాతం వర్షపాతం లోటు నమోదైంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


