Aler Railway Station Stoppage : కొలనుపాకలో 1400 ఏళ్ల ఉత్సవాలు - ఆలేరులో ఈ రైళ్లకు స్టాపేజీ..!

Aler Railway Station Stoppage : కొలనుపాక జైనాలయం 1400 ఏళ్ల వార్షికోత్సవం  సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఆలేరు రైల్వే స్టేషన్‌లో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు తాత్కాలికంగా స్టాపేజ్ మంజూరు చేసింది.

Published on: Oct 14, 2026, 12:09:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Aler Railway Station Stoppage : యాదాద్రి భువనగిరి జిల్లాలోని చారిత్రక కొలనుపాక జైన దేవాలయం 1400వ వార్షికోత్సవ ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఈ మహా ఉత్సవాల నేపథ్యంలో భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్సవాలు జరిగే ఫిబ్రవరి 11, 2027 నుండి ఫిబ్రవరి 13, 2027 వరకు (మొత్తం మూడు రోజుల పాటు) ఆలేరు రైల్వే స్టేషన్‌లో పలు ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైళ్లకు తాత్కాలికంగా స్టాపేజ్ సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించింది.

ఆలేర్ స్టేషన్‌లో పలు రైళ్లకు తాత్కాలిక స్టాపేజ్
ఆలేర్ స్టేషన్‌లో పలు రైళ్లకు తాత్కాలిక స్టాపేజ్

ఈ రైళ్లకు స్టాపేజీ….

  • విశాఖపట్నం - హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్ (రైలు నంబరు 12727) : ఫిబ్రవరి 10, 2027 నుండి ఫిబ్రవరి 12, 2027 వరకు విశాఖపట్నం నుంచి బయలుదేరే ఈ రైలు.. మరుసటి రోజు ఉదయం 04:06 గంటలకు ఆలేరు స్టేషన్‌కు చేరుకుని 04:07 గంటలకు బయలుదేరుతుంది.
  • హైదరాబాద్ - విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్ (రైలు నంబరు 12728) : ఫిబ్రవరి 11, 2027 నుండి ఫిబ్రవరి 13, 2027 వరకు హైదరాబాద్‌లో బయలుదేరే ఈ రైలు సాయంత్రం 18:23 గంటలకు ఆలర్ స్టేషన్‌కు చేరుకుని 18:24 గంటలకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.
  • తాంబరం - హైదరాబాద్ చార్మినార్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబరు 12759): ఫిబ్రవరి 10, 2027 నుండి ఫిబ్రవరి 12, 2027 మధ్య తాంబరంలో బయలుదేరే ఈ రైలు మరుసటి రోజు ఉదయం 05:41 గంటలకు ఆలేరుకు వచ్చి 05:42 గంటలకు బయలుదేరుతుంది.
  • హైదరాబాద్ - తాంబరం చార్మినార్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబరు 12760): ఫిబ్రవరి 11, 2027 నుండి ఫిబ్రవరి 13, 2027 మధ్య హైదరాబాద్ నుంచి ప్రయాణమయ్యే ఈ రైలు రాత్రి 19:24 గంటలకు ఆలేరు స్టేషన్‌కు చేరుకుని 19:25 గంటలకు బయలుదేరుతుంది.
  • సికింద్రాబాద్ - హిసార్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబరు 22737): ఫిబ్రవరి 10, 2027న సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు అర్ధరాత్రి దాటిన తర్వాత 00:34 గంటలకు ఆలేరు స్టేషన్‌కు వచ్చి 00:35 గంటలకు బయలుదేరుతుంది.

ఈ తాత్కాలిక రైలు ఆపుదల సౌకర్యాన్ని కొలన్పాక జైనాలయ ఉత్సవాలకు వచ్చే భక్తులు, సాధారణ ప్రయాణికులు వినియోగించుకోవాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More