తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ వరంగల్ జిల్లా నర్సంపేట బస్టాండ్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. 80 శాతం కాలిన గాయాలతో మెుదట వరంగల్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అక్కడ నుంచి హైదరాబాద్ తరలించారు. శంకర్ గౌడ్ పరిస్థితి విషమించి మృతి చెందారు.

శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట మండలం ముత్తోజిపేటకు ప్రత్యేక అంబులెన్స్‌లో తీసుకొచ్చారు. అంత్యక్రియల కోసం ఏర్పాట్లు జరిగాయి. అయితే ముత్తోజిపేట గ్రామంలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. అంతిమ నివాళులు అర్పించేందుకు ఆయన పార్థివ దేహాన్ని నర్సంపేట డిపోకు తీసుకెళ్లాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ నిరసనలో బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా చేరారు. కార్మికులతో పాటు పార్థివ దేహాన్ని తరలించేందుకు ప్రయత్నించారు.
పోలీసులు జోక్యం చేసుకుని సుదర్శన్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడంతో, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పోలీసు వాహనాన్ని అడ్డగించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిరసనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణతో ఆ ప్రాంతంలో ఆందోళన రేకెత్తించింది.
మరోవైపు నర్సంపేట మండలంలోని మహేశ్వరం వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని పోలీసులు అడ్డుకున్నారు. కాన్వాయ్‌ను ముందుకు పోనివ్వలేదు పోలీసులు. ఒకే వాహనం మాత్రమే వెళ్లాలని చెప్పారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్‌కు నివాళి అర్పించడానికి వెళితే ఇబ్బంది ఏమిటని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి అభ్యంతరం వ్యక్తంచేశారు.
నర్సంపేట సమీపంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర మంత్రి ఆగ్రహంతో ముత్తోజీపేట వెళ్లేందుకు అనుమతించారు పోలీసులు. కేంద్ర మంత్రి రాకతో నర్సంపేటకు బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. నర్సంపేట నుండి వందలాది మందితో ముత్తోజీపేటకు బయలుదేరి వెళ్లారు.
{{/usCountry}}నర్సంపేట సమీపంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర మంత్రి ఆగ్రహంతో ముత్తోజీపేట వెళ్లేందుకు అనుమతించారు పోలీసులు. కేంద్ర మంత్రి రాకతో నర్సంపేటకు బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. నర్సంపేట నుండి వందలాది మందితో ముత్తోజీపేటకు బయలుదేరి వెళ్లారు.
{{/usCountry}}నర్సంపేట ఆర్టీసీ డిపోకు శంకర్ గౌడ్ భౌతిక కాయాన్ని తరలించేదాకా కదిలేది లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. నర్సంపేట డిపోకు తీసుకెళితేనే శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరుతుందన్న ఆర్టీసీ కార్మికులు, కుటుంబ సభ్యులు అంటున్నారు. శంకర్ గౌడ్ భౌతిక కాయాన్ని నర్సంపేట డిపోకు తీసుకెళితే పోలీసులకు అభ్యంతరం ఏమిటని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.
పోలీసులు పదేపదే అడ్డుకుని శవపేటికను రోడ్డుపైనే ఉంచడంతోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.శవ పేటిక తీసి శంకర్ గౌడ్ భౌతిక కాయాన్ని నర్సంపేట డిపోకు తీసుకెళ్లేందుకు యత్నించారు కార్మికులు, బీజేపీ శ్రేణులు. శంకర్ గౌడ్ ఆత్మ చేకూరాలంటే నర్సంపేట డిపోకు తీసుకెళ్లాల్సిందేనని కుటుంబ సభ్యులు పట్టుబడుతున్నారు. శంకర్ గౌడ్ కుటుంబ సభ్యుల విజ్ఝప్తి మేరకు ఆర్టీసీ డిపోకు తరలించాలని బండి సంజయ్ కోరారు. మరోవైపు నర్సంపేటకు భారీగా ఆర్టీసీ కార్మికులు చేరుకుంటున్నారు.