విద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టడానికి ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును పరిశీలించేందుకు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షత వహిస్తారు. ఇందులో 12 మంది ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారు. రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముందే తన నివేదికను సమర్పించాలని స్పీకర్ ఈ కమిటీని ఆదేశించారు.

విద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టే చర్యలను బలోపేతం చేయడమే లక్ష్యంగా రూపొందించిన ఈ చట్టాన్ని, తదుపరి చర్యలు చేపట్టే ముందు సవివరమైన పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీకి పంపారు. ఈ కమిటీలో సభ్యులుగా ఎమ్మెల్యేలు బాలు నాయక్, తోట లక్ష్మీకాంతరావు, మధుసూదన్‌రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి, మామిడాల యశస్విని, దానం నాగేందర్, కోవా లక్ష్మి, మాణిక్‌రావు, రామ్మోహన్ పవార్, అహ్మద్‌బిన్ అబ్దుల్లా బలాలా, కూనంనేని సాంబశివరావు ఉన్నారు.
ఇతర కమిటీలు
ఇక అధికార, ప్రతిపక్ష సభ్యులకు ప్రాతినిధ్యం ఉండేలా పలు అసెంబ్లీ, శాసన మండలి, సంక్షేమ, సంయుక్త కమిటీల ఏర్పాటును కూడా స్పీకర్ ప్రకటించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణ కమిటీ, సౌకర్యాల కమిటీ, అసెంబ్లీ నియమాల కమిటీలకు అధ్యక్షత వహిస్తారు.
కడియం శ్రీహరి కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్స్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఇక మేడిపల్లి సత్యం, పాయం వెంకటేశ్వర్లు, మక్కన్ సింగ్ ఠాకూర్, లక్ష్మీకాంత రావు తోట, డా.మట్ట రాగమయి, చిట్టెం పర్నికారెడ్డి వరుసగా.. ఎస్సీ సంక్షేమం, ఎస్టీ సంక్షేమం, బీసీ సంక్షేమం, మైనారిటీల సంక్షేమం, గ్రంథాలయం, మహిళా, బాలల సంక్షేమం, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ కమిటీలకు నేతృత్వం వహిస్తారు.
అసెంబ్లీ కమిటీలలో ఒక ఛైర్‌పర్సన్, ఆరుగురు సభ్యులు ఉంటారు. పిటిషన్లు, ప్రివిలేజెస్ కమిటీలకు డిప్యూటీ స్పీకర్ నేతృత్వం వహించనుండగా, ప్రభుత్వ హామీల కమిటీకి పట్లోళ్ల సంజీవ రెడ్డి ఛైర్మన్‌గా, ఎథిక్స్ కమిటీకి రేవూరి ప్రకాష్ రెడ్డి నేతృత్వం వహించనున్నారు.
{{/usCountry}}అసెంబ్లీ కమిటీలలో ఒక ఛైర్‌పర్సన్, ఆరుగురు సభ్యులు ఉంటారు. పిటిషన్లు, ప్రివిలేజెస్ కమిటీలకు డిప్యూటీ స్పీకర్ నేతృత్వం వహించనుండగా, ప్రభుత్వ హామీల కమిటీకి పట్లోళ్ల సంజీవ రెడ్డి ఛైర్మన్‌గా, ఎథిక్స్ కమిటీకి రేవూరి ప్రకాష్ రెడ్డి నేతృత్వం వహించనున్నారు.
{{/usCountry}}శాసన మండలి కమిటీలలో ఒక్కొక్కదానిలో ఒక ఛైర్‌పర్సన్, నలుగురు సభ్యులు ఉంటారు. మండలి ఛైర్మన్ గుత్తా సుకేందర్ రెడ్డి నియమాల కమిటీకి, డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్ పిటిషన్లు, ప్రత్యేక హక్కుల కమిటీలకు, కేతవత్ శంకర్ ప్రభుత్వ హామీల కమిటీకి, చల్లా వెంకట్ రామ్ రెడ్డి సభలో ప్రవేశపెట్టిన పత్రాల కమిటీకి అధ్యక్షత వహించనుండగా, మహేష్ కుమార్ గౌడ్ ఎథిక్స్ కమిటీకి ఛైర్మన్‌గా నియమితులయ్యారు.