హేట్ స్పీచ్ బిల్లును సమీక్షించేందుకు కమిటీ.. కొన్ని రోజుల్లో రిపోర్ట్!

విద్వేషపూరిత ప్రసంగాల(Hate Speech) బిల్లును సమీక్షించేందుకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిపై కమిటీ రిపోర్ట్ తయారు చేసి అందించనుంది.

Published on: Jul 7, 2026, 09:57:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టడానికి ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును పరిశీలించేందుకు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షత వహిస్తారు. ఇందులో 12 మంది ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారు. రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముందే తన నివేదికను సమర్పించాలని స్పీకర్ ఈ కమిటీని ఆదేశించారు.

తెలంగాణ అసెంబ్లీ
తెలంగాణ అసెంబ్లీ

విద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టే చర్యలను బలోపేతం చేయడమే లక్ష్యంగా రూపొందించిన ఈ చట్టాన్ని, తదుపరి చర్యలు చేపట్టే ముందు సవివరమైన పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీకి పంపారు. ఈ కమిటీలో సభ్యులుగా ఎమ్మెల్యేలు బాలు నాయక్‌, తోట లక్ష్మీకాంతరావు, మధుసూదన్‌రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి, మామిడాల యశస్విని, దానం నాగేందర్‌, కోవా లక్ష్మి, మాణిక్‌రావు, రామ్మోహన్‌ పవార్‌, అహ్మద్‌బిన్‌ అబ్దుల్లా బలాలా, కూనంనేని సాంబశివరావు ఉన్నారు.

ఇతర కమిటీలు

ఇక అధికార, ప్రతిపక్ష సభ్యులకు ప్రాతినిధ్యం ఉండేలా పలు అసెంబ్లీ, శాసన మండలి, సంక్షేమ, సంయుక్త కమిటీల ఏర్పాటును కూడా స్పీకర్ ప్రకటించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణ కమిటీ, సౌకర్యాల కమిటీ, అసెంబ్లీ నియమాల కమిటీలకు అధ్యక్షత వహిస్తారు.

కడియం శ్రీహరి కమిటీ ఆన్‌ సబార్డినేట్‌ లెజిస్లేషన్స్‌ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఇక మేడిపల్లి సత్యం, పాయం వెంకటేశ్వర్లు, మక్కన్ సింగ్ ఠాకూర్, లక్ష్మీకాంత రావు తోట, డా.మట్ట రాగమయి, చిట్టెం పర్నికారెడ్డి వరుసగా.. ఎస్సీ సంక్షేమం, ఎస్టీ సంక్షేమం, బీసీ సంక్షేమం, మైనారిటీల సంక్షేమం, గ్రంథాలయం, మహిళా, బాలల సంక్షేమం, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ కమిటీలకు నేతృత్వం వహిస్తారు.

అసెంబ్లీ కమిటీలలో ఒక ఛైర్‌పర్సన్, ఆరుగురు సభ్యులు ఉంటారు. పిటిషన్లు, ప్రివిలేజెస్ కమిటీలకు డిప్యూటీ స్పీకర్ నేతృత్వం వహించనుండగా, ప్రభుత్వ హామీల కమిటీకి పట్లోళ్ల సంజీవ రెడ్డి ఛైర్మన్‌గా, ఎథిక్స్ కమిటీకి రేవూరి ప్రకాష్ రెడ్డి నేతృత్వం వహించనున్నారు.

శాసన మండలి కమిటీలలో ఒక్కొక్కదానిలో ఒక ఛైర్‌పర్సన్, నలుగురు సభ్యులు ఉంటారు. మండలి ఛైర్మన్ గుత్తా సుకేందర్ రెడ్డి నియమాల కమిటీకి, డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్ పిటిషన్లు, ప్రత్యేక హక్కుల కమిటీలకు, కేతవత్ శంకర్ ప్రభుత్వ హామీల కమిటీకి, చల్లా వెంకట్ రామ్ రెడ్డి సభలో ప్రవేశపెట్టిన పత్రాల కమిటీకి అధ్యక్షత వహించనుండగా, మహేష్ కుమార్ గౌడ్ ఎథిక్స్ కమిటీకి ఛైర్మన్‌గా నియమితులయ్యారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More