వచ్చే విద్యా సంవత్సరం 2026-27 నుండి తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్(TG BIE) సిలబస్‌లో మార్పులు చేయనుంది. సిలబస్ సవరణను చేపడుతోంది. గణితం, కెమిస్ట్రీ, కొన్ని సబ్జెక్టులలో మార్పులు చేస్తారు. దీంతో విద్యార్థులకు కాస్త భారం తగ్గనుంది.

తెలుగు భాష, చరిత్ర విషయానికొస్తే తెలంగాణ చరిత్ర, సంస్కృతికి సంబంధించిన పాఠాలపై ఎక్కువ ప్రాధాన్యత పెరుగుతోంది. జేఈఈ, NEET UG వంటి వివిధ పోటీ ప్రవేశ పరీక్షలకు అనుసరించే NCERT సిలబస్ ఆధారంగా బోర్డు ఈ మార్పులను చేస్తోంది. 2026-27 విద్యా సంవత్సరానికి సిలబస్ సవరణను చేపట్టిన బోర్డు.. కఠినంగా ఉన్న కొన్ని గణితం 1B అంశాలను తొలగించింది. అంతేకాదు కెమిస్ట్రీ భాగాన్ని దాదాపు 30 శాతం తగ్గించగా, కొన్ని సబ్జెక్టులలో 20 శాతం కోత విధించారు.
ఇంటర్‌లో మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బీ పేపర్లు 75 మార్కుల చొప్పున జరుగుతున్నాయి. అయితే వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి థియరీ పరీక్షను 60 మార్కులకు కుదిస్తారు. మిగిలిన 15 మార్కులు ఇంటర్నల్స్‌కు కేటాయిస్తారు. కాలేజీలో చేతిలో 15 మార్కులు ఉంటాయి. విద్యార్థుల సామర్థ్యం, ప్రాజెక్టులు, అటెండెన్స్ లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని మార్కులు వేస్తారు. ఫస్ట్ ఇయర్ వారికి కూడా ఇంటర్నల్స్ ఉంటాయన్నమాట.
ప్రస్తుతం మ్యాథ్స్ బీలో ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నట్టుగా బోర్డు గుర్తించింది. దీంతో ఇంటర్ బోర్డు మ్యాథ్స్ బీ పాఠ్య పుస్తకంలోని కొన్ని కఠినమైన చాప్టర్లను మ్యాథ్స్ ఏలోకి మార్చానుంది. ఈ మార్పులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయి.
ఎంఈసీ విద్యార్థులకు గణితం పేపర్‌కు మొత్తం మార్కులను 150 నుండి 100కి తగ్గించారు. ఎంపీసీ, ఎంఈసీ విద్యార్థులకు మ్యాథ్స్ పేపర్ ఒకేలా ఉంది. రెండు పేపర్లకు 150 మార్కులను శాతంగా తీసుకుని 100 మార్కులకు కుదించారు. ఎంపీసీ, ఎంఈసీ విద్యార్థులకు వేర్వేర్వుగా ప్రశ్నపత్రాలు రూపొందిస్తారు. సైన్స్ కోర్సులలో కూడా 20 నుంచి 30 శాతం సిలబస్ తగ్గనుంది.
అంతేకాకుండా వచ్చే విద్యా సంవత్సరం నుండి అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్(ఏసీఈ) అనే కొత్త కోర్సు ప్రవేశపెడతారు. స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్ చేసినప్పుడు సబ్జెక్టు అందించేలా.. పాఠ్యపుస్తకాలపై క్విక్ రెస్పాన్స్ (QR) కోడ్లను ముద్రించాలని బోర్డు నిర్ణయించింది.
{{/usCountry}}అంతేకాకుండా వచ్చే విద్యా సంవత్సరం నుండి అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్(ఏసీఈ) అనే కొత్త కోర్సు ప్రవేశపెడతారు. స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్ చేసినప్పుడు సబ్జెక్టు అందించేలా.. పాఠ్యపుస్తకాలపై క్విక్ రెస్పాన్స్ (QR) కోడ్లను ముద్రించాలని బోర్డు నిర్ణయించింది.
{{/usCountry}}సవరించిన సిలబస్ ఆధారంగా తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాలను సిద్ధం చేస్తుంది. 2026 ఏప్రిల్ రెండో వారం నాటికి కొత్త పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల వేసవి సెలవుల్లో కొత్త సిలబస్‌పై లెక్చరర్లకు శిక్షణా కార్యక్రమాలను బోర్డు, కళాశాలలు నిర్వహించగలుగుతాయి.
పాఠ్యపుస్తకాల అనువాదాలు ఒకేసారి జరుగుతున్నాయి. గతంలో ఉర్దూ మీడియం పుస్తకాలు.. ఇంగ్లీష్ మీడియం ఎడిషన్ల తర్వాత ఒక సంవత్సరం అనంతరం విడుదలయ్యాయి. కానీ ఈసారి రెండు పుస్తకాలు ఒకేసారి ముద్రిస్తాయి. కాగితం నాణ్యతను కూడా పెంచుతున్నారు.