TGCAB Recruitment : తెలంగాణ కో-ఆపరేటివ్ బ్యాంక్ లో ఉద్యోగాలు - నెలకు రూ. 2 లక్షలకు పైగా జీతం, వివరాలివే
తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఆదిలాబాద్, మహబూబ్ నగర్ డీసీసీబీలోని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మార్చి 7వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాలి.
తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (TGCAB) నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ ఖాళీలు ఆదిలాబాజ్, మహబూబ్ నగర్ డీసీసీబీలో ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీ కోసం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఆదిలాబాద్ డీసీసీబీలో ఒక పోస్టును, మహబూబ్ నగర్ డీసీసీబీలో మరో పోస్టును భర్తీ చేస్తారు. గరిష్ట వయోపరిమితి 62 ఏళ్లు దాటకూడదు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డీబీఎఫ్ లేదా CAIIB/ లేదా కోఆపరేటివ్ బిజినెస్ మేనేజ్ మెంట్ లో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. లేదా పీజీ, చార్టెడ్ అకౌంటెంట్ లో ఉత్తీర్ణత పొందా ఉండాలి. బ్యాంకింగ్ రంగంలో 8 ఏళ్లకు తగ్గకుండా పని చేసిన అనుభవం ఉండాలి.
నోటిఫికేషన్ ముఖ్య వివరాలు:
- ఉద్యోగ నోటిఫికేషన్ - తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్
- ఉద్యోగాలు -చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
- కంప్యూటర్ అప్లికేషన్స్‌పై ప్రావీణ్యం ఉండాలి. తెలుగు భాషపై పట్టు (మాట్లాడటం, చదవడం, రాయడం) తప్పనిసరి.
- ఎంపికైన వారికి నెలకు రూ.2,60,000 జీతం చెల్లిస్తారు.
- దరఖాస్తు విధానం - https://tgcab.bank.in/notifications వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకోవాలి. అవసరమైన ధ్రువపత్రాల జిరాక్స్ సెట్ ను జతచేసి ఆఫ్లైన్ విధానంలో పంపించాలి.
- దరఖాస్తులకు చివరితేదీ - 7 మార్చి 2026.(సాయంత్రం 5 గంటల లోపు)
- అప్లికేషన్ ఫారమ్ ను https://tgcab.bank.in/notifications వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. మీ వివరాలను నింపాలి.
- అప్లికేషన్ ఫీజు - రూ. 1000 చెల్లించాలి. (TGCAB, Hyderabad పేరు మీద డీడీ తీయాలి)
- దరఖాస్తు పూర్తి చేసిన ఫారమ్ పంపాల్సిన చిరునామా - "ది మేనేజింగ్ డైరెక్టర్, ది తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, హెడ్ ఆఫీస్ ట్రూప్ బజార్, హైదరాబాద్ – 500001.
- అధికారిక వెబ్ సైట్ - https://tgcab.bank.in/notifications
ఈ లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

