TG CPGET Application Dates 2026 : రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'టీజీ సీపీజీఈటీ - 2026' (TG CPGET - 2026) రాసే అభ్యర్థులకు అలర్ట్. ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ గడువును అధికారులు పొడిగించారు. ఎలాంటి ఆలస్య రుసుము (Late Fee) లేకుండా ఆన్‌లైన్ అప్లికేషన్లను సమర్పించడానికి చివరి తేదీని 2026 జూన్ 15 (సోమవారం) వరకు పొడిగిస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సవరించిన పూర్తి పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేశారు.
ఫైన్ తో దరఖాస్తు తేదీలు…

విద్యార్థుల సౌకర్యార్థం పొడిగించిన ఈ గడువుతో పాటు…. ఒకవేళ జూన్ 15 లోపు దరఖాస్తు చేసుకోలేకపోతే రూ. 500 ఆలస్య రుసుముతో జూన్ 17 (బుధవారం) వరకు, అలాగే రూ. 2000 భారీ ఆలస్య రుసుముతో జూన్ 19 (శుక్రవారం) వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ ఫారమ్‌లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకోవడానికి జూన్ 16 నుండి జూన్ 19 వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.
మరోవైపు పరీక్షల నిర్వహణకు సంబంధించి జూన్ 24 నాటికి టెస్ట్ సెంటర్లను ఖరారు చేయనున్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను జూన్ 28 (ఆదివారం) నుండి అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఈ ప్రవేశ పరీక్షను జూలై మొదటి వారంలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో మాత్రమే నిర్వహించనున్నారు.
పరీక్ష ముగిసిన అనంతరం జూలై 17న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. ఈ కీ పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే జూలై 19 వరకు ఒక్కో అభ్యంతరానికి రూ. 200 చెల్లించి ఫిర్యాదు చేయవచ్చు. అభ్యంతరం సరైనదేనని తేలితే, ఫలితాలు వచ్చిన 7 పనిదినాల్లోగా ఆ రుసుమును తిరిగి రీఫండ్ చేస్తారు. ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు, ర్యాంకుల ప్రకటన తేదీని తర్వాత వెల్లడిస్తారు.
ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ , తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్టాత్మక వర్సిటీల్లో ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ సహా పలు కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది ఈ ప్రవేశ పరీక్ష బాధ్యతలను కాకతీయ యూనివర్శిటీ పర్యవేక్షిస్తోంది.
{{/usCountry}}ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ , తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్టాత్మక వర్సిటీల్లో ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ సహా పలు కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది ఈ ప్రవేశ పరీక్ష బాధ్యతలను కాకతీయ యూనివర్శిటీ పర్యవేక్షిస్తోంది.
{{/usCountry}}