...
...
Next Story

TG CPGET 2026 Counseling : టీజీ సీపీగెట్ కౌన్సెలింగ్ అప్డేట్ - వెబ్ ఆప్షన్ల గడువు పొడిగింపు

TG CPGET Counselling Updates : టీజీ సీపీగెట్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్ల నమోదు గడువును సెప్టెంబర్ 12 వరకు పొడిగించారు. తొలి విడత సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 17న ఉంటుంది.

Published on: Sep 11, 2026, 21:49:12 IST
Advertisement

TG CPGET Counselling Updates : రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, వాటి పరిధిలోని కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ సీపీగెట్ (TG CPGET - 2026) కౌన్సెలింగ్ కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా అభ్యర్థులు కళాశాలలు, కోర్సులను ఎంచుకోవడానికి ఉద్దేశించిన 'వెబ్ ఆప్షన్ల' నమోదు గడువును పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 12వ తేదీ వరకు తమ వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చని ప్రవేశాల విభాగం వెల్లడించింది.

టీజీ సీపీగెట్ కౌన్సెలింగ్
టీజీ సీపీగెట్ కౌన్సెలింగ్

ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (CPGET) ర్యాంకుల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో ఎంఏ (MA), ఎంకామ్ (M.Com), ఎంఎస్సీ (M.Sc)తో పాటు ఇతర పీజీ డిప్లొమా, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. సీట్ల కేటాయింపు ప్రక్రియలో వెబ్ ఆప్షన్లు అత్యంత కీలకమైనవి కావడంతో, అభ్యర్థులు తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఎక్కువ సంఖ్యలో ఆప్షన్లు నమోదు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

తొలి విడత సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

అభ్యర్థులు నమోదు చేసుకున్న ఆప్షన్లు, వారి ర్యాంకు, రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా మొదటి విడత తాత్కాలిక సీట్ల కేటాయింపును చేపడతారు. ఈ ఫలితాలను సెప్టెంబర్ 17వ తేదీన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. సీటు పొందిన అభ్యర్థులు అలాట్‌మెంట్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, నిర్దేశిత గడువులోగా సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

సెప్టెంబర్ 19 నుంచి రెండో విడత రిజిస్ట్రేషన్లు

మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ పూర్తయిన వెంటనే, మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి రెండో విడత ప్రవేశాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అధికారికంగా షురూ కానుంది. తొలి విడతలో రిజిస్ట్రేషన్ చేసుకోని వారు లేదా కొత్తగా దరఖాస్తు చేయాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks