TG CPGET Counselling : టీజీ సీపీగెట్ ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి - అలాట్‌మెంట్ లింక్, రిపోర్టింగ్ తేదీలివే

తెలంగాణ టీజీ సీపీగెట్ చివరి విడత కౌన్సెలింగ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సుల్లో 5,385 మందికి సీట్లు లభించాయి. అభ్యర్థులు అక్టోబర్ 27వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

Published on: Oct 23, 2026, 14:19:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (TG CPGET) చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈ ఆఖరి విడత కౌన్సెలింగ్‌లో మొత్తం 5,385 మంది విద్యార్థులు ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ వంటి వివిధ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో సీట్లు దక్కించుకున్నారు.

టీజీ సీపీగెట్‌
టీజీ సీపీగెట్‌

చివరి విడత కౌన్సెలింగ్ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళాశాలల్లో మొత్తం 34,059 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియలో మొత్తం 9,606 మంది విద్యార్థులు పోటీపడ్డారు. విద్యార్థుల మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా వారిలో 5,385 మందికి సీట్లు కేటాయించినట్లు అధికారులు స్పష్టం చేశారు.

రిపోర్టింగ్ తేదీలివే…

సీట్లు పొందిన అభ్యర్థులు వెంటనే ఆన్‌లైన్ విధానంలో నిర్ణీత ఫీజు చెల్లించి అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రవేశాల కన్వీనర్ ఆచార్య ఐ. పాండురంగారెడ్డి తెలిపారు. అలాట్‌మెంట్ పొందిన విద్యార్థులు ఈ నెల 27వ తేదీలోగా తమకు సీటు వచ్చిన కళాశాలల్లో నేరుగా హాజరై, సర్టిఫికెట్లతో రిపోర్ట్ చేయాలని ఆయన సూచించారు. నిర్దేశిత గడువు లోగా ఫీజు చెల్లించకపోయినా లేదా కళాశాలలో రిపోర్ట్ చేయకపోయినా సీటు రద్దవుతుందని స్పష్టం చేశారు.

అలాట్‌మెంట్ లెటర్ డౌన్లోడ్ విధానం ఇలా…

  • అభ్యర్థులు ముందుగా అధికారిక ప్రవేశాల పోర్టల్ https://cpgetadmissions.com/new/ ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజీలో కనిపించే 'Allotment Login' లింక్‌పై క్లిక్ చేయాలి.
  • మీ హాల్ టికెట్ నంబర్, సాధించిన ర్యాంక్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను సరిగ్గా నమోదు చేయాలి.
  • వివరాలు నమోదు చేసిన తర్వాత 'Submit' బటన్‌పై క్లిక్ చేస్తే మీ సీటు కేటాయింపు వివరాలు (Allotment Details) స్క్రీన్‌పై కనిపిస్తాయి.
  • అనంతరం 'Print' లేదా 'Download' ఆప్షన్ ద్వారా అలాట్‌మెంట్ కాపీని సేవ్ చేసుకుని ప్రింటవుట్ తీసుకోవాలి.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More