...
...
Next Story

TG DOST 2026 Allotment : 'దోస్త్' సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు - అలాట్‌మెంట్ లింక్, రిపోర్టింగ్ తేదీ వివరాలు

TG DOST Second Phase Seat Allotment 2026 : ‘టీజీ దోస్త్’ సెకండ్ ఫేజ్ సీట్లను కేటాయించారు.అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 5లోగా ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

Published on: May 30, 2026 04:34 PM IST
Advertisement

TG DOST Second Phase Seat Allotment 2026 : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లోని కోర్సుల్లో ప్రవేశాల కోసం దోస్త్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి విడత ప్రవేశాలు పూర్తి కాగా.. ఇవాళ రెండో విడత సీట్లను కేటాయించారు.

దోస్త్ 2026
దోస్త్ 2026

దోస్త్ 2026- రెండో విడతలో 46,504 మంది విద్యార్థులు కొత్తగా నమోదు చేసుకోగా…. మొదటి విడతలో సీటు వచ్చి అంతకంటే మంచి కాలేజీ కోసం చూస్తున్న విద్యార్థులతో కలిపి మొత్తం 60,439 మంది వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు. వీరిలో 52,302 మంది విద్యార్థులకు సీట్లు ఖరారయ్యాయి.

కేటాయించిన సీట్లలో కోర్సుల వారీగా కామర్స్ 21,431, ఫిజికల్ సైన్స్ - 15,245, లైఫ్ సైన్సెస్ - 9,664, ఆర్ట్స్ - 5,955, ఇతర కోర్సులకు చెందిన ఏడు మందికి సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులకు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు సందేశాలు కూడా పంపారు. దోస్త్ వెబ్‌సైట్ లాగిన్ ద్వారా లేదా వాట్సాప్ (రిక్వెస్ట్ పంపడం ద్వారా) సీటు అలాట్‌మెంట్ ఆర్డర్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

దోస్త్ రెండో విడత సీట్ల కేటాయింపు - అలాట్ మెంట్ ఇలా:

సీటు పొందిన విద్యార్థులు తమ వివరాలను తెలుసుకోవడానికి దోస్త్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

  • విద్యార్థులు మొదటగా https://dost.cgg.gov.in వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి.
  • మీ దోస్త్ ఐడీ వివరాలతో లాగిన్ కావాలి.
  • మీకు సీటు ఖరారు అయితే అలాట్‌మెంట్ లెటర్‌ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా అలాట్ మెంట్ కాపీని పొందొచ్చు.
  • అడ్మిషన్ ప్రక్రియలో అలాట్ మెంట్ కాపీ ఎంతో కీలకం. కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోవాలి.

సీటు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో నిర్ణీత రుసుము చెల్లించి సీటును రిజర్వ్ చేసుకోవాలి. ఆన్‌లైన్ పేమెంట్ పూర్తి చేసిన తర్వాతే మీ సీటు ఖరారవుతుంది. లేనిపక్షంలో ఆ సీటు తదుపరి విడత కౌన్సెలింగ్‌లో ఇతరులకు కేటాయించబడుతుంది.

దోస్త్ ఫేజ్ 3 రిజిస్ట్రేషన్లు మే 31 నుండి జూన్ 15 వరకు జరుగుతాయి. వెబ్ ఆప్షన్లు జూన్ 16 వరకు అందుబాటులో ఉంటాయి. తుది సీట్ల కేటాయింపును జూన్ 20న విడుదల చేస్తారు. అభ్యర్థులు జూన్ 20 నుండి జూన్ 25 మధ్య ఆన్‌లైన్ రిపోర్టింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: టీజీ దోస్త్ సెకండ్ ఫేజ్ అలాట్‌మెంట్ కాపీని ఏ వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి?

జవాబు: అభ్యర్థులు దోస్త్ అధికారిక వెబ్‌సైట్ https://dost.cgg.gov.in/welcome.do నుండి తమ సీట్ అలాట్‌మెంట్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ప్రశ్న: సెకండ్ ఫేజ్‌లో సీటు వచ్చిన విద్యార్థులు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి చివరి తేదీ ఎప్పుడు?

జవాబు: సీట్లు పొందిన విద్యార్థులు 5 జూన్ 2026 లోగా ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియను ఖచ్చితంగా పూర్తి చేయాలి.

ప్రశ్న: ఒకవేళ నిర్ణీత గడువు లోపు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే ఏమవుతుంది?

జవాబు: ఇచ్చిన గడువులోగా ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయకపోతే మీకు కేటాయించిన డిగ్రీ సీటు రద్దవుతుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe