DOST : దోస్త్ నోటిఫికేషన్ విడుదల.. మూడు దశలు.. ముఖ్యమైన తేదీలు ఇవే
Telangana DOST Notification : తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు సంబంధించి దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు ముఖ్యమైన తేదీలను ప్రకటించారు. ఆ వివరాలేంటో చూడండి..
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు 2026-27 విద్యా సంవత్సరానికిగాను డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకృష్ణ రెడ్డి మూడు దశల ప్రవేశ ప్రక్రియను వివరిస్తూ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. షెడ్యూల్ ప్రకారం.. మొదటి దశ రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 15 నుండి మే 7 వరకు, వెబ్ ఆప్షన్లు ఏప్రిల్ 30 నుండి మే 8 వరకు అందుబాటులో ఉంటాయి. మొదటి దశ సీట్ల కేటాయింపును మే 14న ప్రకటిస్తారు, ఆ తర్వాత మే 15 నుండి మే 23 వరకు ఆన్‌లైన్ సెల్ఫ్-రిపోర్టింగ్ ఉంటుంది.

రెండో దశ రిజిస్ట్రేషన్లు మే 15 నుండి మే 25 వరకు జరుగుతాయి. వెబ్ ఆప్షన్లు మే 26 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ దశకు సీట్ల కేటాయింపు మే 30న జరగనుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ మే 31 నుండి జూన్ 5 వరకు జరుగుతుంది.
ఫేజ్ 3 రిజిస్ట్రేషన్లు మే 31 నుండి జూన్ 15 వరకు జరుగుతాయి. వెబ్ ఆప్షన్లు జూన్ 16 వరకు అందుబాటులో ఉంటాయి. తుది సీట్ల కేటాయింపును జూన్ 20న విడుదల చేస్తారు. అభ్యర్థులు జూన్ 20 నుండి జూన్ 25 మధ్య ఆన్‌లైన్ రిపోర్టింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా డిగ్రీ కోర్సులలో ప్రవేశం కోరుకునే విద్యార్థులు షెడ్యూల్‌ను జాగ్రత్తగా ఫాలో కావాలి. నిర్దేశించిన కాలపరిమితిలోగా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించడమైనది.
ముఖ్యమైన తేదీలు
- ఏప్రిల్ 15 నుంచి మే 7 వరకు దోస్త్ ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్.
- ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్.
- మే 14న ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఉంటుంది.
- ఫస్ట్ ఫేజ్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ మే 15 నుంచి 23 వరకు ఉండనుంది.
- సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ మే 15 నుంచి మే 25 వరకు జరుగుతుంది.
- సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ మే 15 నుంచి మే 26 వరకు నిర్వహిస్తారు.
- మే 30న సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది.
- సెకండ్ ఫేజ్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ మే 31 నుంచి జూన్ 5 వరకు ఉండనుంది.
- థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ మే 31 నుంచి జూన్ 15 వరకు నిర్వహిస్తారు.
- థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు మే 31 నుంచి జూన్ 16 వరకు చేస్తారు.
- థర్డ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ జూన్ 20న చేస్తారు.
- ఆన్‌లైన్ రిపోర్టింగ్ జూన్ 20 నుంచి జూన్ 25 వరకు జరుగుతుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


