TG Inter Supplementary Exams : నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపులు - పరీక్షల షెడ్యూల్ ఇదే

TG Inter Supplementary Exams 2026: టీజీ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. అయితే విద్యార్థులు ఇవాళ్టి నుంచే పరీక్ష ఫీజులు చెల్లించుకోవచ్చు. మే 13 నుంచి ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి.

Published on: Apr 13, 2026, 07:02:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇంటర్‌మీడియట్‌ పరీక్షల ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. మరోవైపు పరీక్షలు తప్పిన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను కూడా ఇంటర్‌బోర్డు ప్రకటించింది. మే 13 నుంచి 21వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ప్రధాన సబ్జెక్టులు మాత్రం మే 19వ తేదీతోనే ముగుస్తాయి.

తెలంగాణ ఇంటర్ పరీక్షలు
తెలంగాణ ఇంటర్ పరీక్షలు

నేటి నుంచి ఫీజు చెల్లింపులు…

అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఖరారు కాగా… నేటి నుంచి పరీక్షల ఫీజు చెల్లింపులు ప్రారంభమవుతాయి. ఆయా విద్యార్థులు… వారు చదువుతున్న కాలేజీలోనే ఈ ఫీజును చెల్లించాల్సి ఉంటుందని ఇంటర్ బోర్డు పేర్కొంది. ఏప్రిల్ 20వ తేదీలోపు ఈ ఫీజును చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. గడువు పొడిగింపు ఉండని తెలిపింది.

టీజీ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా… మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయి. రెండో సంవత్సరం పరీక్షలు… మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు.

ప్రాక్టికల్స్ ఎప్పుడంటే..?

ఇక ఫిబ్రవరిలో నిర్వహించిన ప్రాక్టికల్ పరీక్షలకు ఏవైనా కారణాల వల్ల హాజరుకాలేకపోయిన విద్యార్థులకు బోర్డు మరో అవకాశం కల్పించింది. మే 22వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు వీరికి ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఇక ఆంగ్ల భాషకు సంబంధించి ప్రాక్టికల్ పరీక్షలను మే 26న జరపాలని అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు.

కేవలం ఫెయిలైన విద్యార్థుల కంటే మార్కులు పెంచుకోవాలనుకునే ప్రథమ సంవత్సరం విద్యార్థులే ఈ పరీక్షలకు భారీగా హాజరయ్యే అవకాశం ఉంది. దాదాపు 75 శాతం మంది విద్యార్థులు ఏదో ఒక సబ్జెక్టులో మళ్లీ పరీక్ష రాసేందుకు ఆసక్తి చూపుతారని ఇంటర్ బోర్డు అంచనా వేస్తోంది. ఒకవేళ సప్లిమెంటరీలో మార్కులు తగ్గితే, గతంలో వచ్చిన పాత మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు. అంటే విద్యార్థికి ఎలాంటి నష్టం ఉండదు. ఈ వెసులుబాటు ఉండటంతో మెరుగైన మార్కుల కోసం విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది.

పరీక్షల షెడ్యూల్ వివరాలు:

  • మే 13: సెకండ్ లాంగ్వేజ్ (పేపర్-I & II)
  • మే 14: ఇంగ్లీష్ (పేపర్-I అండ్ II)
  • మే 15: మ్యాథ్స్-1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ / మ్యాథ్స్-2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్
  • మే 16: మ్యాథ్స్-1B, జువాలజీ, హిస్టరీ / మ్యాథ్స్-2B, జువాలజీ, హిస్టరీ
  • మే 18: ఫిజిక్స్, ఎకనామిక్స్ (పేపర్-I & II)
  • మే 19: కెమిస్ట్రీ, కామర్స్ (పేపర్-I & II)
  • మే 20: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ (BiPC విద్యార్థులకు)
  • మే 21: మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ (పేపర్-I & II)

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ):

ప్రశ్న: టీజీ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు ప్రారంభమవుతాయి?

జవాబు: మే 13 నుంచి ప్రారంభమై మే 21 వరకు జరుగుతాయి. ప్రధాన సబ్జెక్టులు మే 19తో పూర్తవుతాయి.

ప్రశ్న: ఇంప్రూవ్‌మెంట్ పరీక్ష రాస్తే మార్కులు తగ్గే ప్రమాదం ఉందా?

జవాబు: లేదు. ఒకవేళ సప్లిమెంటరీలో మార్కులు తగ్గినా… పాత పరీక్షలో వచ్చిన ఎక్కువ మార్కులనే బోర్డు ఫైనల్ చేస్తుంది. కాబట్టి విద్యార్థులకు ఎలాంటి రిస్క్ ఉండదు.

ప్రశ్న : టీజీ ఇంటర్ ఫలితాలను ఎక్కడ చెక్ చేసుకోవాలి..?

జవాబు : పరీక్షలు రాసిన విద్యార్థులు https://tgbie.in/result.html వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More