...
...
Next Story

TG DOST 2026 Counseling : దోస్త్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ అప్డేట్ - రిజిస్ట్రేషన్‌కు ఇవాళే చివరి తేదీ, ఇదే చివరి ఛాన్స్

TG DOST 2026 Special Phase Counseling : తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు కొనసాగుతున్నాయి. అయితే దోస్త్ 2026 ప్రత్యేక విడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్‌కు ఇవాళే చివరి తేదీ. డిగ్రీ ప్రవేశాలు కోరుకునే విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Published on: Jul 26, 2026, 06:03:05 IST
Advertisement

TG DOST 2026 Special Phase Counseling : రాష్ట్రంలో డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ ప్రత్యేక విడతకు సంబంధించిన రిజిస్ట్రేషన్ గడువు నేటితో (జూలై 26, 2026) ముగియనుంది. అర్హత గల విద్యార్థులు ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఉన్నత విద్యామండలి సూచించింది.

దోస్త్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ - ముఖ్యమైన తేదీలు

  • అర్హులైన విద్యార్థులు… రూ. 400/- ఫీజు చెల్లించి జూలై 26, 2026 వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు.
  • విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలను ఎంచుకోవడానికి జూలై 27, 2026 వరకు అవకాశం కల్పించారు.
  • పీహెచ్ (PH), సీఏపీ (CAP), ఎన్సీసీ (NCC), స్పోర్ట్స్, అదనపు కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నవారికి జూలై 27, 2026 న యూనివర్సిటీ హెల్ప్‌లైన్ కేంద్రాలలో ధృవీకరణ పత్రాల పరిశీలన జరుగుతుంది.
  • జూలై 30, 2026 న సీట్లు కేటాయిస్తారు.
  • సీటు పొందిన విద్యార్థులు జూలై 30, 2026 నుండి ఆగస్టు 01, 2026 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలి.
  • ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న విద్యార్థులు తమ ఒరిజినల్ టీసీ (TC) మరియు ఇతర ధృవీకరణ పత్రాలను జూలై 31, 2026 నుండి ఆగస్టు 01, 2026 లోపు సంబంధిత కళాశాలలో సమర్పించాలి. సరైన సమయంలో రిపోర్టింగ్ చేయకపోతే సీటు కేటాయింపు రద్దవుతుంది.

దోస్త్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ 2026
దోస్త్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ 2026

ఇంతవరకు దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియలో అసలు రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు, అలాగే గత మూడు విడతలలో దరఖాస్తు చేయని వారు ఈ ప్రత్యేక విడతలో కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి పూర్తిగా అర్హులవుతారు. గతంలో దోస్త్ ఐడీ పొంది, ఇప్పటివరకు జరిగిన ఏ విడతలోనూ సీటు సాధించలేకపోయిన అభ్యర్థులు తమ పాత ఐడీ మరియు పిన్ (PIN) ఉపయోగించి నేరుగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

అలాగే…. గత విడతలలో సీటు వచ్చి నచ్చని కళాశాలలో చేరిన వారు ఇప్పుడు కొత్తగా వేరే కాలేజీకి మారాలనుకుంటే ఈ ప్రత్యేక విడత ద్వారా వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. విద్యార్థులు తమకు సీటు లభించే అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. https://dost.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe