తెలంగాణలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్ (TG EAPCET 2026) రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. తొలి విడత సీట్ల కేటాయింపు తర్వాత మిగిలిపోయిన సుమారు 27,487 సీట్ల భర్తీకి తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) ఈ కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తోంది. మొదటి విడతలో సీటు రాని వారు, సీటు వచ్చినా నచ్చని వారు, మెరుగైన కాలేజీల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు ఈ రెండో విడతలో పాల్గొనవచ్చు.
వెబ్ ఆప్షన్ల ముఖ్యమైన తేదీలు

వెబ్ ఆప్షన్ల నమోదు: జూలై 18 నుండి జూలై 19, 2026 వరకు.
ఆప్షన్ల ఫ్రీజింగ్ : జూలై 19, 2026.
రెండో విడత సీట్ల కేటాయింపు: జూలై 22, 2026 లేదా అంతకంటే ముందు చేస్తారు.
ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ : జూలై 22 నుంచి 24 వరకు.
కాలేజీల్లో డైరెక్ట్ రిపోర్టింగ్ : జూలై 25 నుంచి 28 వరకు.
వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే విధానం
కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులు ఎలాంటి తప్పులు లేకుండా వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి కింది విధానాన్ని అనుసరించాలి.
ముందుగా అధికారిక కౌన్సెలింగ్ పోర్టల్ https://tgeapcet.nic.in ను సందర్శించండి.
హోమ్‌పేజీలో ఉన్న 'Candidate Login' ఆప్షన్‌పై క్లిక్ చేసి, మీ ఈఏపీసెట్ హాట్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ, క్యాప్చా వివరాలను ఎంటర్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
మీరు ఏ ఏ జిల్లాల్లో సీటు పొందాలనుకుంటున్నారో ఆ జిల్లాలను ఎంపిక చేసుకోండి. అనంతరం ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న కాలేజీలు, మీకు కావలసిన బ్రాంచ్‌ల కోడ్‌లను ప్రాధాన్యత క్రమంలో
మీరు ఎంచుకున్న ఆప్షన్లను ఎప్పటికప్పుడు సేవ్ ఆప్షన్ ద్వారా సేవ్ చేయాలి. లేదంటే మళ్లీ మెుదటి నుంచి చేయాల్సి రావొచ్చు. జూలై 19 లోగా మీ ఆప్షన్లను ఖరారు చేస్తూ Freeze చేయాలి.
{{/usCountry}}మీరు ఎంచుకున్న ఆప్షన్లను ఎప్పటికప్పుడు సేవ్ ఆప్షన్ ద్వారా సేవ్ చేయాలి. లేదంటే మళ్లీ మెుదటి నుంచి చేయాల్సి రావొచ్చు. జూలై 19 లోగా మీ ఆప్షన్లను ఖరారు చేస్తూ Freeze చేయాలి.
{{/usCountry}}రెండో విడతలో వెబ్ ఆప్షన్లు కొత్తగా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మొదటి విడతలో పెట్టిన ఆప్షన్లు ఈ విడతలో పరిగణనలోకి తీసుకోరు. రెండో విడత సీట్ల కేటాయింపు జూలై 22, 2026 నుంచి ఉంటుంది. ఆన్‌లైన్ ట్యూషన్ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ జూలై 22 నుండి జూలై 24 వరకు చేయాలి. అలాట్ అయిన కాలేజీలో ఫిజికల్ రిపోర్టింగ్ జూలై 25 నుండి జూలై 28, 2026 మధ్య ఉంటుంది. సీటు రద్దు చేసుకునేందుకు చివరి తేదీ జూలై 28, 2026గా నిర్ణయించారు. విద్యార్థులు తమకు నచ్చిన కోర్సు లేదా కాలేజీ వచ్చే వరకు ఎక్కువ సంఖ్యలో ఆప్షన్లు ఇచ్చుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.